పోస్ట్‌డేటెడ్‌ చెక్కులతో పండగ చేసుకోవాలా..?

పాత మోసాన్ని కప్పిపుచ్చి...మళ్లీ కొత్తమోసం..

చంద్రబాబుకు ఓటేస్తే..కడుపులు మాడ్చుకోవాల్సిందే...

చంద్రబాబు డ్రామాలు నమ్మొద్దు..

మాట మీద నిలబడే జగనన్నను నమ్మండి..

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా..

హైదరాబాద్‌: పోస్ట్‌డేటెట్‌ చెక్కులతో మహిళలను చంద్రబాబు మోసం చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ధ్వజమెత్తారు.హైదరాబాద్‌ లోటప్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు కొత్త కొత్త వేషాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పోస్ట్‌డేటెడ్‌  చెక్కులు ఇచ్చి పండగ వాతావరణం కొనసాగుతుందని తన అనుకూల మీడియాతో ప్రచారం చేయించుకోవడంతో చంద్రబాబును ప్రజలు ఛీకొడుతున్నారన్నారు. ఐదేళ్ల పాలనలో మహిళల తాళిబొట్లు తెగిపోయే విధంగా చంద్రబాబు పరిపాలించి నేడు మహిళలకు పసుపు–కుంకుమ ఇస్తున్నానని చెప్పడం హాస్యాస్పదమన్నారు. పదివేల రూపాయలు అనేది పెద్ద డ్రామాగా అభివర్ణించారు. పసుపు–కుంకుమ అనేది చాలా పవిత్రమైనందని..పసుపు–కుంకుమను మన ఇంట్లో ప్రేమతో ఇస్తామని.. అప్పుల రూపంలో, ఇన్‌స్టాల్‌మెంట్‌ రూపంలో ఇవ్వరన్నారు. ఎన్నికల సమయంలో ఇలాంటి పోస్ట్‌ డేటెడ్‌  చెక్కులు ఇచ్చి మోసగించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. సొంత అక్కాచెల్లెళ్లను మోసం చేసిన చంద్రబాబు.. రాష్ట్రంలో అక్కాచెల్లెళ్లను మోసం చేశారనడంలో అశ్చర్యం లేదన్నారు.

ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తే ఈసీ అడ్డగిస్తుందనే నమ్మకంతోనే చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారన్నారు. మహిళలకు న్యాయం చేయాలనే ఆలోచనే లేదన్నారు. పాత మోసాన్ని కప్పిపుచ్చుకోవడానికే మళ్లీ కొత్తమోసానికి చంద్రబాబు తెరలేపాడన్నారు. 2014లో రూ. 14,200 కోట్లు డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి నేడు వరుకూ మాఫీ చేయలేదన్నారు. నేడు 22వేల కోట్లకు మించిపోయిందన్నారు. డ్వాక్రా అక్కాచెల్లెమ్మలను దారుణంగా మోసం చేశారన్నారు. తడి గుడ్డతో గొంతుకోసేసి పదివేల చెక్కును మూడు పోస్ట్‌ డేటెడ్‌ పేరుతో ఇచ్చేసి పండగ చేసుకోవాలంటే.. ఎలా పండగ చేసుకోవాలో చంద్రబాబే సమాధానం చెప్పాలన్నారు.

చెక్కులిస్తుంటే ఆనందంతో ఏడుస్తున్న మహిళలు.. అంటూ పచ్చమీడియాలో ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు.. వనజాక్షి, మెడికో సంధ్య,నారాయణ కాలేజిలో ఆత్మహత్యలు చేసుకున్న ఆడపిల్లల తల్లిదండ్రులు,కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌లో వ్యభిచారకూపంలో జీవితాలు నాశనం చేసుకున్న మహిళల  కన్నీళ్ల ఫొటోలు ఎందుకు పత్రికల్లో వేయించలేదని  ప్రశ్నించారు. రాప్తాడులో మంత్రి సునీతకు మహిళలు చెప్పులు,చీపుర్లుతో ఏవిధంగా స్వాగతం పలికారో  తెలిసిందేన్నారు. ఆ విధంగానే పసుపు–కుంకుమకు వెళ్తున్న,టీడీపీ ఎమ్మెల్యేలు,మంత్రులను చొక్కాలు పట్టుకుని మహిళలంతా ప్రశ్నించాలన్నారు. డ్వాక్రా రుణమాఫీ  ఎందుకు చేయలేదని నిలదీయాలన్నారు. డ్వాక్రా మహిళలను అమాయకులు,పిచ్చివాళ్లుగా భావించి చెక్కులు ఇస్తే ఓట్లు వేసేస్తారనే విధంగా చంద్రబాబు  ఆలోచిస్తున్నారన్నారు. మళ్లీ మోసపోయి చంద్రబాబుకు ఓట్లు వేస్తే మళ్లీ 57 నెలలు కడుపుమాడ్చుకోవలసిన పరిస్థితి వస్తోందన్నారు.

చంద్రబాబు మోసాలపై వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి చైతన్యపరుస్తుంటే ఆయనపై టీడీపీ నేతలు దాడి చేయడం దారుణమన్నారు. పోలీసు వ్యవస్థ ఏమవుతుందని ప్రశ్నించారు. న్యాయం ఎక్కడ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. డ్వాక్రా మహిళలపై పోలీసు జులం చూపిస్తున్నారన్నారు. డ్వాక్రా శాఖ మంత్రిగా ఉండి మహిళలను మోసం చేయడం సిగ్గులేదా అని మంత్రి పరిటాల సునీతను ప్రశ్నించారు.రెండు సంవత్సరాలు వడ్డీలేని రుణాలు ఇవ్వకుండా  డ్వాక్రా మహిళలను మోసం చేశారు.పోలీసులు లేకుండా  డ్వాక్రా మహిళల దగ్గరకి వెళ్ళే ధైర్యం ఉందా అని మంత్రి సునీతను ప్రశ్నించారు. ఆడవారి తాళిబొట్లు తెగిపోయేవిధంగా ప్రతి ఊరుకో బారు, వీధికో బెల్ట్‌షాపు పెట్టినందుకు చంద్రబాబుకు ఓట్లు వేయాలా..బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికొస్తుందని మోసం చేసి ఓట్లు వేయించుకునందుకు  ఓట్లు వేయాలా..నిజాయతీ గల అధికారి వనజాక్షిని..  టీడీపీ ఎమ్మెల్యే జుట్టు పట్టుకుని లాగి కొడితే..ఇంటికి పిలిచి సెటిల్‌మెంట్‌ చేసినందుకు  ఓట్లు వేయాలా..కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌లో మహిళల జీవితాలను కాలరాసిన ఎమ్మెల్యే,ఎమ్మెల్సీలను కాపాడినందుకు ఓట్లు వేయాలా..నారాయణ కాలేజిలో ఆడపిల్లలను ఆత్మహత్యలు చేసుకునేవిధంగా చేసిన నారాయణను కాపాడునందుకు ఓట్లు వేయాలా..ఎందుకు ఓట్లు వేయాలని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. డ్వాక్రా  మహిళలపై చంద్రబాబుకు నిజమైన గౌరవం, ప్రేమ ఉంటే.. నేటివరుకు ఉన్న 22 వేల కోట్లు రుణాలను మాఫీ చేసి అప్పుడు ప్రజలను ఓట్లు అడగాలన్నారు.మహిళలను మోసం చేసిన చంద్రబాబును నమ్మొద్దన్నారు. మద్యపాన నిషేధాన్ని చేస్తానన్న జగనన్నను నమ్మాలన్నారు. అమ్మ ఒడి పథకం కింద మీ అందరి పిల్లల్ని స్కూల్‌కు పింపిస్తే 15వేలు ఖాతాలో వేయడమే కాకుండా మీ పిల్లలు ఏ చదువుకున్న ఉచితంగా చదివిస్తానన్న జగనన్నను నమ్మాలన్నారు. మాట మీద నిలబడే జగన్‌మోహన్‌ రెడ్డిని నమ్మాలని  తెలిపారు.

 

Back to Top