మాలాంటి పేదల కోసం పుట్టిన రాజు జ‌గ‌న‌న్న‌

తాళ్ళపూడి బీకాం విద్యార్థిని దివ్య 

కొవ్వూరు: మాలాంటి పేదల కోసం పుట్టిన రాజువి, రారాజువు, తరానికి ఒక్కడు, యుగానికి ఒక్కడు సీఎం వైయ‌స్ జ‌గన్ మోహ‌న్ రెడ్డి అని  తాళ్ళపూడి మండ‌లం బీకాం విద్యార్థిని దివ్య  కొనియాడారు. కొవ్వూరులో ఏర్పాటు చేసిన జ‌గ‌న‌న్న విద్యా దీవెన కార్య‌క్ర‌మంలో దివ్య మాట్లాడారు.

అన్నా, నా తల్లిదండ్రులిద్దరూ వికలాంగులు, నా తండ్రి అవిటివాడు, తల్లి మూగ, చెవిటి, మేం ఇద్దరం ఆడపిల్లలం, అమ్మకు, నాన్నకు పెన్షన్ ఇస్తూ నేను ఉన్నాను అని భరోసానిచ్చారు. నేను కార్పొరేట్ కాలేజ్ లో డిగ్రీ చదువుతున్నాను, నాఫీజులంతా మీరే చెల్లించారు, వసతి దీవెన కింద అన్నీ ఇచ్చి నన్ను నిలబెట్టారు, నేను ఇంటర్ వరకు తెలుగు మీడియంలోనే చదివాను, మీ దయవల్ల ఈ రోజు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నానంటే మీరే కారణం, మీరు స్కూల్స్ రూపురేఖలు మార్చేశారు, మీరు కులం చూడరు, మతం చూడరు, రాజకీయం చూడరు, మా పేదల కోసం వచ్చిన మీరు మా భవిష్యత్ నిలబెట్టారు, మీరు చేసిన మేలు ఎప్పటికీ మరచిపోలేను, గతంలో అమ్మానాన్న పెన్షన్స్ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగేవారు కానీ మీరు ఉదయాన్నే వారికి జీతమిచ్చినట్లు పెన్షన్ ఇస్తున్నారు, రేషన్ బియ్యం కూడా ఇంటికే వస్తున్నాయి, మీరు మా లాంటి పేదలకు మంచిరోజులు తెచ్చారు, మీరు మా ఇంటి కొడుకులా ఆదుకున్నారు, నిరుపేదలు ఆనందంగా ఉన్నారంటే కారణం మన జగనన్న, సంక్షేమ పథకాలు అందుకున్న పేదల దీవెనలు మీకు అండగా ఉంటాయి, మాలాంటి పేదల కోసం పుట్టిన రాజువి, రారాజువు, తరానికి ఒక్కడు, యుగానికి ఒక్కడు, ఈ ఏపీకి మన సీఎం జగనన్న. ధ్యాంక్యూ. 

ప్రసన్నకుమార్, బీటెక్ విద్యార్ధి, తాడేపల్లిగూడెం

సార్, నేను దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను, మా నాన్న రైతు, అమ్మ గృహిణి, నేను జగనన్న విద్యాదీవెన లబ్ధిదారుడిని, గతంలో కేవలం రూ. 35 వేలు మాత్రమే ఇచ్చేవారు కానీ ఇప్పుడు పూర్తిగా ఫీజు మొత్తం కూడా ఫీజు రీఇంబర్స్మెంట్ ద్వారా పొందుతున్నాం. మీరు మోసపూరిత హమీలు ఇవ్వకుండా ఇచ్చిన ప్రతి హమీ నెరవేర్చిన ఏకైక నాయకుడు మీరు. మీరు ఉన్నత విద్యలో ప్రభావవంతమైన సంస్కరణలు తీసుకొచ్చారు, నూతన విద్యావిధానానికి సంబంధించిన పాలసీని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం మనది. మన విద్యావిధానం అంతర్జాతీయ స్ధాయికి ఎదిగింది, మీ హయాంలో ఇంజినీరింగ్ ప్లేస్ మెంట్ లో 90 శాతంపైగా సాధిస్తున్నారు, నా కాలేజ్ విద్యార్ధి అమేజాన్ లో రూ. 44 లక్షల ప్యాకేజ్ కి సెలక్ట్ అయ్యాడంటే మీరే కారణం. మీ నవరత్నాల పథకాల లబ్ధి పొందుతున్నాం, మీరు మాపై ఖర్చుపెట్టిన ప్రతి రూపాయికి న్యాయం చేసి ఏపీని ముందుకు తీసుకెళతాం, మీ పేరు ఎక్కడ రాయాలన్న చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఏపీగా కాకుండా ద పర్మినెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఏపీగా రాయాలనుకుంటున్నాం, అటువంటి అవకాశం మీరు కల్పించాలి, ధ్యాంక్యూ.

Back to Top