పండుగ‌లా `వైయ‌స్ఆర్ పెన్ష‌న్‌ కానుక‌` పంపిణీ

విజ‌య‌వాడ‌: రాష్ట్ర వ్యాప్తంగా వైయ‌స్ఆర్ పెన్షన్‌ కానుక పంపిణీ పండుగ‌లా కొనసాగుతోంది. 62.69 లక్షల మంది పింఛ‌న్ ల‌బ్ధిదారుల‌కు గానూ రూ.1594.66 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. తెల్లవారుజాము నుంచే వ‌లంటీర్లు ల‌బ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ఉదయం 9.20 గంటల వరకు 64.83 శాతం పెన్షన్లు పంపిణీ చేసినట్లు డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు తెలిపారు. 41.27 లక్షల మందికి రూ.1048.23 కోట్ల నగదు పంపిణీ జరిగినట్లు ఆయన వెల్లడించారు.

తాజా వీడియోలు

Back to Top