ఆర్‌బీకేల్లో డిజిట‌ల్ పేమెంట్ విధానం అమ‌లు

అమ‌రావ‌తి: రైతుభ‌రోసా కేంద్రాల్లో (ఆర్‌బీకే) డిజిట‌ల్ పేమెంట్ విధానాన్ని ప్ర‌భుత్వం నేటి నుంచి అమ‌లు చేస్తోంది. రైతులు త‌మ‌కు కావాల్సిన ఉత్పాద‌కాలు.. ఎరువులు, విత్త‌నాలు, పురుగు మందులను కొనుగోలు చేసి డిజిటల్ విధానంలో చెల్లింపులు చేసేలా ఆంధ్ర‌ప్ర‌దేశ్ అగ్రోస్ సంస్థ సేవ‌ల‌ను అందుబాటులోకి తెచ్చింది. ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి సూచ‌న మేర‌కు న‌గ‌దు చెల్లింపుల‌తో పాటు డిజిటల్ విధానంలో కూడా రైతులు చెల్లిపులు చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. దీని ద్వారా రైతులు నేరుగా భీమ్‌, గూగుల్ పే, పేటియం, ఫోన్ పే వంటి డిజిటల్ విధానంలో చెల్లింపులు జ‌రిపి త‌మ‌కు కావాల్సినవి కొనుగోలు చేయ‌వ‌చ్చు.

Back to Top