కూటమి అరాచకాలకు మూల్యం తప్పదు

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే కేఆర్‌జే భరత్  

కుప్పంలో డిజిట‌ల్ బుక్ క్యూఆర్ కోడ్ పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ 

చిత్తూరు: కూటమి పాలనలో అన్యాయానికి పాల్పడుతున్న ప్రతి ఒక్కరూ భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధంగా ఉండాలని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే కేఆర్‌జే భరత్ హెచ్చరించారు. కూటమి ప్రభుత్వంలో అన్యాయానికి గురైన ప్రతి  కార్యకర్తకు పార్టీ తరఫున డిజిటల్‌ బుక్‌ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు కుప్పంలోని పార్టీ  కార్యాలయంలో డిజిటల్‌ బుక్‌ను భ‌ర‌త్ సోమ‌వారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. కూటమి ఏలుబడిలో అన్యాయానికి గురైన కార్యకర్తలు ధైర్యంగా క్యూఆర్‌ కోడ్‌, ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. దీనికోసమే వైయ‌స్‌ జగన్‌ ఈ కొత్త వ్యవస్థ తీసుకువచ్చారన్నారు.  మూడున్నరేళ్లలో వచ్చేది కచ్చితంగా వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వమనే విషయం ప్రజల్లో బలంగా వినిపిస్తోందన్నారు.  కూటమి దగా పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య పైనా వైయ‌స్ఆర్‌సీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. రైతులకు ఎరువుల సమస్య వస్తే వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు ఎక్కడికక్కడ రోడ్డెక్కి, పోలీసు కేసులకు సైతం వెరవకుండా పోరాటం చేయబట్టే రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి ఎరువులు దిగుమతి చేసుకుందని చెప్పారు. ప్రజల పక్షాన పోరాడేది వైయ‌స్ఆర్‌సీపీ మాత్రమేనన్నారు. ప్రతి సమస్యపై స్పందిస్తున్న పార్టీగా రాష్ట్ర ప్రజలంతా వైయ‌స్ఆర్‌సీపీని చూస్తున్నారన్నారు. టీడీపీ మాదిరిగా ఎన్నికలకు ఆరు నెలల ముందు మాత్రమే తమ పార్టీ బయటకు రాలేదన్నారు. 

Back to Top