అభివృద్ధే మా ప్ర‌భుత్వ ధ్యేయం..  

 మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాదరావు  
 

శ్రీ‌కాకుళం:  రాష్ట్ర అభివృద్ధే ప్ర‌భుత్వ ధ్యేయ‌మ‌ని, సంక్షేమ ప్ర‌జ‌ల హ‌క్కుగా ఈ ప్ర‌భుత్వం పాల‌న సాగిస్తుంద‌ని మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు అన్నారు. అధికారంలోకి వ‌చ్చాక గ్రామంలో ఉండే వారికి హాయిగా జీవించేందుకు సంక్షేమ పథకాలు, వ్యవసాయ చేసే రైతులకు సూచనలు చేసేందుకు రైతు భరోసా కేంద్రాలు , పిల్లలకు పౌష్టికాహారం అందించాలని అంగన్వాడీ కేంద్రాలు స‌మ‌ర్థ రీతిలో నిర్వ‌హిస్తున్నామ‌ని తెలిపారు. శ్రీ‌కాకుళం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం, గార మండ‌లం జొన్న‌ల‌పాడు, రామ‌చంద్రాపురం గ్రామాల‌లో ఆయ‌న ప‌ర్య‌టించి సంక్షేమ ప‌థ‌కాల నిర్వ‌హ‌ణ వెనుక ఉన్న ఆవ‌శ్య‌క‌త‌ను వివ‌రించేందుకు ప్రాధాన్యం ఇచ్చారు.ఈ  సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... త‌మ ప్ర‌భుత్వం ఏర్ప‌డి మూడేళ్లే అయిన‌ప్ప‌టికీ ఎన్నో మంచి కార్య‌క్ర‌మాలు చేశామ‌ని చెప్పారు.  

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చంద్రబాబు నిన్నటి పర్యటన లో నిత్యావసర ధరలు పెరిగాయని అంటున్నారు, దేశం మొత్తం మీద ధ‌ర‌లు పెరిగాయన్న వాస్త‌వాన్ని గమనించాలి. ఈ విష‌యమై ప్రజలను తప్పు దోవ పట్టించకూడదు. గతంలో చంద్రబాబు హయాంలో పల్లెల్లో కళ తప్పిందని అన్నారు. వైస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న అభివృద్ధి చంద్రబాబు కళ్ళకు కనిపించడం లేదా ? రూ.1.90 కోట్ల అభివృద్ధి పనులు రామచంద్రపురం పంచాయతీలో జరిగాయి. అర్హత ఒక్కటే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. రాజ్యాంగం కల్పించిన హక్కుగా ప్రజలు భావించేటట్లుగా పథకాలు అందిస్తున్నాం. దేశంలో బొగ్గు కొరత తీవ్రంగా ఉంది. అందుకే దేశం మొత్తం మీద విద్యుత్ కోతలు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో ఈ సమస్యను అధిగమించేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారు.

కోవిడ్ సమయంలో శ్రీకాకుళం రిమ్స్ ఆస్ప‌త్రి ద్వారా చాలా మంది రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందించాం. గతంలో కంటే మరిన్ని ఎక్కువ సదుపాయాలు కల్పించాం. ఇది కేవలం వైస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే సాధ్యమైంది. వంశధార ఫేజ్ 2 పూర్తి చేసి సంవత్సరం పొడవునా గ్రామాలకు నీరు అందించే ప్రయత్నం చేస్తున్నాం. రైతులు వరి కి బదులుగా ఇతర పంటల వైపు మొగ్గు చూపాల‌ని కోరుతున్నాం.

ప‌లు అభివృద్ధి ప‌నులు ప్రారంభం 
గార మండ‌లం, జొన్నలపాడు లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రెవెన్యూ మంత్రి ధర్మాన శ్రీ‌కారం దిద్దారు. జొన్నలపాడు కాలనీ, రామచంద్రపురం గ్రామాల‌లో 17 ల‌క్ష‌ల‌కు పైగా వెచ్చించి నిర్మించిన అంగన్వాడీ కేంద్రాలను ప్రారంభించి, నిర్వాహ‌కుల‌కు శుభాకాంక్షలు తెలిపారు. రామచంద్రపురం,శిమ్మ పేట, అంబటివాని పేట, జొన్నలపాడు ఇంటికో తాగునీటి కుళాయి పథకాన్ని ప్రారంభించి, ఇక‌పై ప‌థకాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని, నీటి వృథాను నివారించాల‌ని కోరారు. రామ‌చంద్రాపురం పంచాయ‌తీలో రూ.21.80 లక్షల అంచనా వ్య‌యంతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని, రూ.17.50 లక్షల అంచనా వ్యయం తో నిర్మించిన విల్లేజ్ క్లినిక్- ను ప్రారంభించారు. ఇదే సంద‌ర్భంలో బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

కార్యక్రమంలో అధికారులు, గార మండల నాయకులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Back to Top