సచివాలయం: రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ మంత్రిగా ధర్మాన ప్రసాదరావు బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంత్రిగా తనకు కేటాయించిన శాఖల బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రిగా తనకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి ధర్మాన ప్రసాదరావు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో రెవెన్యూ మంత్రిగా పని చేసిన అనుభవం ఉందన్నారు. తనకు వ్యక్తిగతంగా ఎలాంటి లక్ష్యాలు లేవని, సీఎం వైయస్ జగన్, రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చటమే తన లక్ష్యమన్నారు. సీనియర్ అధికారుల సమన్వయంతో పనిచేస్తామని చెప్పారు.
‘‘రెవెన్యూ భూ యాజమాన్యానికి సంబంధించిన శాఖ. అందరితో కలిసి టీమ్ వర్క్ చేయటం నాకు అలవాటు. రాష్ట్రం, దేశంలో ఎక్కువగా భూ వివాదాలు ఉన్నాయి. దీనివల్ల ఎకనమికల్ గ్రోత్‌కు భూమి ఉపయోగపడటం లేదు. ఎక్కువ ల్యాండ్‌ను ఫ్రీ హోల్డ్ చేస్తే జీడీపీ పెరుగుతుంది. సీఎం వైయస్ జగన్ అందుకే భూ సర్వేకు ప్రాధాన్యత ఇచ్చారు. పీఓటీ యాక్ట్ నుండి తొలగించి నామినల్ ఫీజుల ద్వారా పేదలకు భూములు ఇచ్చారని’’ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు.