డీజీపీకి వైయ‌స్ జ‌గ‌న్ అభినంద‌న‌లు

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ నూతన డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసుగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి గౌతమ్‌ సవాంగ్‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అభినందించారు. తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో డీజీపీ సీఎంను క‌లిసి పుష్పగుచ్ఛాలు అందించారు.  రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ‌కు కృషి చేయాల‌ని, ప్ర‌భుత్వంలో క‌లిసి ముందుకు సాగుదామ‌ని వైయ‌స్ జ‌గ‌న్ ఆకాంక్షించారు.

అంతకుముందు డీజీపీ మీడియాతో మాట్లాడుతూ.. గత ఐదేళ్లుగా ఏపీ పోలీసులు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారని  తెలిపారు. ప్రతి పోలీసు సేవను వినియోగించుకుంటామని చెప్పారు. పోలీసు వ్యవస్థలో  పారదర్శకత, సంస్కరణలు, సంస్థాగత మార్పులు అవసరమని పేర్కొన్నారు.  ‘ముఖ్యమంత్రికి పోలీసులపట్ల ఎంతో అభిమానం, గౌరవం ఉంది. సేవాభావంతో పనిచేయాలని ఆయన కోరారు. పోలీస్‌శాఖకు కావాల్సిన అన్నిరకాల సదుపాయాల్ని కల్పిస్తామని సీఎం హామీనిచ్చారు. మహిళలు, పిల్లలు, వృద్ధుల రక్షణకై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. క్రైమ్‌ ఎక్కువగా మహిళలు, చిన్నపిల్లలపై జరుగుతోంది. నేర రహిత ఏపీని తీర్చిదిద్దుతాం. సైబర్‌క్రైమ్‌ అరికట్టడంలో ఏపీ పోలీసులు మరింత కష్టపడాలి. రోడ్డు ప్రమాదాల్లో ఏపీ మూడో స్థానంలో ఉండటం విచారకరం. ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతాం’అన్నారు.

Back to Top