డీజీపీని, పోలీస్‌ శాఖను అభినందించిన సీఎం

తాడేపల్లి: జాతీయ స్థాయిలో ఉత్తమ డీజీపీతో పాటు అత్యుత్తమ పోలీసింగ్‌లో అవార్డులు సాధించిన ఏపీ పోలీస్‌ శాఖను, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు.  తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు జాతీయ స్థాయిలో ఉత్తమ డీజీపీగా ఎంపికైన గౌతమ్‌ సవాంగ్‌ను, అత్యుత్తమ పోలీసింగ్‌లో 13 అవార్డులు గెలుచుకున్న పోలీస్‌ శాఖను సీఎం వైయస్‌ జగన్‌ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇంటెలిజెన్స్‌ డీజీ కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డి, డీఐజీ టెక్నికల్‌ సర్వీసెస్‌ జి. పాలరాజు ఉన్నారు. 
 

తాజా ఫోటోలు

Back to Top