దొంగ ఓట్లతో బాబు గద్దెనెక్కే ప్రయత్నం

టీడీపీ కుట్రలపై దేవినేని అవినాష్‌ ఫైర్‌

విజ‌య‌వాడ‌:  టీడీపీ నేత చంద్ర‌బాబు దొంగ ఓట్లతో గద్దెనెక్కే ప్రయత్నం చేస్తున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త దేవినేని అవినాష్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చంద్రబాబు మాటలు నమ్మరని పవన్‌ను తోడు తీసుకెళ్లి సీఈసీకి ఫిర్యాదు చేశార‌న్నారు. విజ‌య‌వాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దొంగ ఓట్లతోనే రెండుసార్లు గెలిచాడ‌ని విమ‌ర్శించారు. తూర్పు నియోజకవర్గంలో చనిపోయిన వారి ఓట్లు, బంధువుల ఓట్లను చేర్చారని ఆరోపించారు. దొంగ ఓట్లపై టీడీపీ నేతలు మాట్లాడుతుంటే దొంగే దొంగ దొంగ అని అరిచినట్టుంద‌ని ఎద్దేవా చేశౄరు. దొంగ ఓట్ల ఏరివేతకు వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం కట్టుబడి ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. దొంగ ఓట్ల ఏరివేతలో అధికారుల కృషి అభినందనీయమ‌ని దేవినేని అవినాష్‌ ప్ర‌శంసించారు.

Back to Top