వైవీ సుబ్బారెడ్డిని క‌లిసిన డిప్యూటీ స్పీక‌ర్ కొల‌గ‌ట్ల‌

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉమ్మ‌డి జిల్లాల కో-ఆర్డినేట‌ర్‌, టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డిని డిప్యూటీ స్పీక‌ర్  కోలగట్ల వీరభధ్రస్వామి మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. గురువారం తాడేప‌ల్లిలోని వైవీ సుబ్బారెడ్డి స్వ‌గృహంలో ఆయ‌న్ను కోల‌గ‌ట్ల స‌మావేశ‌మ‌య్యారు.  సామాన్య కార్యకర్తగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన కోలగట్ల వీరభధ్రస్వామి డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన విష‌యం విధిత‌మే.  రెండుసార్లు ఎమ్మెల్యే, రెండు సార్లు ఎమ్మె ల్సీగా ఎన్నికైన ఆయనకు సీఎం వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి డిప్యూటీ స్పీకర్‌గా అవకాశం కల్పించారు.  

 2013 సంవత్సరంలో కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 2014 సంవత్సరంలో ఎమ్మెల్సీ పదవితోపాటు ఆ పార్టీకి రాజీనామాచేసి వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఉంది.  ప్రస్తుతం విజయనగరం ఎమ్మెల్యేగా,  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ గా కొల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి కొనసాగుతున్నారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top