పార్టీ పటిష్టతకు అందరం పునరంకితమ‌వ్వాలి

డిప్యూటీ సీఎం, వైయ‌స్ఆర్ సీపీ సీనియ‌ర్ నేత‌ ధర్మాన కృష్ణదాస్‌ 

తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్‌కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అడుగుజాడ‌ల్లో న‌డుస్తూ పార్టీ ప‌టిష్ట‌త కోసం పున‌రంకిత‌మ‌వ్వాల‌ని డిప్యూటీ సీఎం, వైయ‌స్ఆర్ సీపీ సీనియ‌ర్ నేత‌ ధ‌ర్మాన కృష్ణ‌దాస్ అన్నారు. వైయ‌స్ఆర్ సీపీ 12వ ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో జ‌రిగిన వేడుక‌ల్లో ఆయ‌న పాల్గొని మాట్లాడారు. పార్టీలో ప్రతి ఒక్కరూ ఉమ్మడి కుటుంబంలా, దివంగ‌త  మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఆశ‌య సాధ‌న వారసులుగా సంఘటితంగా కలిసిమెలిసి పనిచేయాల‌న్నారు. పార్టీలో పదవుల కోసం ఆతృత పడాల్సిన అవసరం లేదని, కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరినీ గౌరవిస్తూ, వారికి సముచితమైన పదవులు ఇచ్చే గొప్ప మనసు పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జగన్‌కి ఉంద‌న్నారు. ఎవరికి ఏ అవకాశం వచ్చినా.. పార్టీని దృష్టిలో పెట్టుకుని నాయకుడి అడుగుజాడల్లో నడవాల‌ని సూచించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top