ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం 

అధికారుల‌కు డిప్యూటీ సీఎం రాజ‌న్న దొర ఆదేశాలు
 

విశాఖ‌:  ముంపు ప్రాంతాల్లో స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రం చేయాల‌ని డిప్యూటీ సీఎం రాజ‌న్న దొర అధికారుల‌ను ఆదేశించారు. చింతూరు పరిసర ముంపు ప్రాంతాల గూర్చి అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, రంప చోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మీ తో డిప్యూటీ సీఎం రాజన్నదొర చ‌ర్చించారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారి ఆదేశాలనుసారం ఇటీవలే పడిన భారీ వర్షాలకు చింతూరు సమీప ప్రాంతాల్లో ముంపునకు గురైన గ్రామాల గూర్చి, బాధితుల కోసం తీసుకుంటున్న సహాయక చర్యపై చ‌ర్చించారు.  ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, వరద ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు ఆహారం, తాగునీరు ప్రజలు అందించాలని అధికారులను రాజ‌న్న దొర సూచించారు.   

తాజా వీడియోలు

Back to Top