ఈ నెల 19 వ తేదీన విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ర్ట డిప్యూటి సిఎం పీడిక రాజన్నదొర,బిసి సంక్షేమం,సమాచార శాఖమంత్రి శ్రీ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణలు పిలుపు ఇచ్చారు. 139 కులాలకు సంబంధించి 56 బిసి కార్పోరేషన్ల చైర్మన్లు ,ఇతర కార్పోరేషన్లలోని బిసిి,ఎస్సి,ఎస్టి,బిసి ఛైర్మన్లు,డైరక్టర్ల సమావేశం తాడేపల్లిలోని ఓ హోటల్ లో బుధవారం జరిగింది.సమావేశానికి శాసనమండలి విప్,పార్టీ కేంద్ర కార్యాలయ ఇన్ ఛార్జ్ లేళ్ల అప్పిరెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు. రాష్ట్ర డిప్యూటి సీఎం పీడిక రాజన్నదొర మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత బాబాసాహేబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ కు గర్వకారణం అని అన్నారు. విజయవాడ నగరంలో నడిబొడ్డున ఆయన విగ్రహం ఏర్పాటుచేస్తూ శ్రీ వైయస్ జగన్ తీసుకున్ననిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. అంబేద్కర్ సిధ్దాంతాలను,ఆశయాలను,లక్ష్యాలను నమ్మే శ్రీ వైయస్ జగన్ సామాజిక న్యాయం చేస్తున్నారన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని నమ్మారు..దానిని ఆకళింపు చేసుకున్నారు...అంబేద్కర్ అడుగుజాడలలో నడుస్తున్నారు.భారతదేశంలో ఎక్కడాలేని విధంగా స్వేచ్చా,స్వాతంత్ర్యానికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటుచేయడం ప్రజలందరూ మెచ్చే నిర్ణయం అన్నారు. సాధారణంగా అంబేద్కర్ విగ్రహాలు దళితవాడలలో,పల్లెల్లో అంటే ప్రతి ఊరి చివరన కాలనీలలో కనబడుతుంటాయని కాని జగన్ గారు విజయవాడ నడిబొడ్డున ఏర్పాటుచేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.ఎస్సి,ఎస్టి లు బడుగు,బలహీన వర్గాలు మైనారిటీలు అగ్రవర్ణాలలో పేదలకు కూడా సామాజిక న్యాయం చేస్తున్న జగన్ గారు అందరికి ఆదర్శంగా నిలుస్తారన్నారు. తెలుగుదేశం హయాంలో కేవలం చంద్రబాబు రాజ్యాంగం నడిచేదన్నారు. బడుగు,బలహీనవర్గాలకు కార్పోరేషన్లు ఏర్పాటుచేయడం ద్వారా ఆ వర్గాలలో నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నారని వివరించారు. జగన్ గారు మనందరికి ఏం చేస్తున్నారు. మన వర్గాలకు ఎన్ని ప్రయోజనాలు కల్పిస్తున్నారో అందరికి తెలుసున్నారు. ఎస్సి,ఎస్టి,బిసి,మైనారిటీ వర్గాలకు ఇన్ని చేసిన ముఖ్యమంత్రి జగన్ గారికి అవసరం అయినప్పుడు మనందరం అండగా నిలవాలన్నారు. జగన్ గారు చేసిన మంచిపనులను అన్ని కులాల నేతలు వారి కులంలో ప్రతి ఒక్కరికి తెలియచేయాలని కోరారు. కుల సంఘాలతో మాట్లాడి అంబేద్కర్ అడుగుజాడలలో నడిపించే విధంగా చేయాలన్నారు. ముఖ్యంగా కార్పోరేషన్ల ఛైర్మన్లు సచివాలయాల ఉద్యోగులతో సమన్వయం చేసుకుని కార్యక్రమానికి హాజరుకావలన్నారు. 2.68 లక్షల కోట్ల రూపాయల డిబిటి ద్వారా ప్రజలకు వారి అకౌంట్లలో నేరుగా వేసిన విషయాన్ని మరచిపోకూడదన్నారు. అమ్మఒడి తీసుకుంటున్న ప్రతి తల్లికి జగన్ గారు చేసిన మేలు చెప్పాలన్నారు. ముఖ్యంగా అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని వేడుకలా భావించి ప్రజలు తరలిరావాలన్నారు. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ ఈ నెల 19 న విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణను పండుగలా నిర్వహించాలని కోరారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విగ్రహం కింద ఏర్పాటుచేస్తున్న వేదికతో కూడితే దాదాపు 195 అఢుగుల ఎత్తులో కారణజన్ముడైన అంబేద్కర్ విగ్రహం మనకు కనిపిస్తుందన్నారు. విజయవాడలో చూస్తే జగన్ గారు ఏర్పాటుచేస్తున్న రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం సగర్వంగా చూడవచ్చన్నారు. వివిధ దేశాలలో అధ్యయనం చేసి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇంత పెద్ద భారత దేశ ప్రజాస్వామ్యాన్ని ఎల్లప్పుడూ పరిఢవిల్లేలా చేస్తోందన్నారు. అంబేద్కర్ ఆశయాల సాధనకు అనుగుణంగా పరిపాలన సాగిస్తున్న శ్రీ వైయస్ జగన్ అన్నారు. గ్రామసచివాలయాల పరిధిలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం గురించి ప్రచారం చేయాలని కోరారు. ఆ కార్యక్రమానికి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చేవిధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రజాప్రతినిధులు పాలకులు కాదు సేవకుడు అని అంబేద్కర్ చెప్పిన మాటలను తూచతప్పకుండా పాటిస్తున్ననాయకుడు జగన్.బిసిలకు 56 కార్పోరేషన్లను ఏర్పాటుచేసి వారిలో నాయకత్వలక్షణాలను పెంపొందించింది జగన్ మాత్రమే నని అన్నారు.జనరల్ కార్పోరేషన్ల ఛైర్మన్లుగా కూడా బడుగు,బలహీనవర్గాలను నియమించిన ఘనత జగన్ గారిదేనన్నారు. సామాజిక న్యాయం విషయంలో ఈ దేశానికి ఆదర్శంగా నిలిచిన గొప్ప సంస్కర్త జగన్ అని తెలియచేశారు. జగన్ గారు ప్రవేశపెట్టిన పధకాలు పేదలను,బిసి,ఎస్సి,ఎస్టి,మైనారిటీలను అభివృధ్దిపధంలోకి తెచ్చేవేనని తెలిపారు. గ్రామ సచివాలయాలు,వాలంటీర్లు వ్యవస్ధ ఏర్పాటు అనేది రాష్ర్టంలో గొప్ప సంస్కరణలు అని అన్నారు. అవే కాదు జగన్ గారు ప్రవేశపెట్టిన అమ్మఒడి బాలకార్మిక వ్యవస్ధను రూపుమాపిందన్నారు. చేయూత,ఆసరా వంటి పధకాలు మహిళా సాధికారతను తెచ్చాయన్నారు. అనేక సంక్షేమ పధకాలు వాటి ఫలితాలు చూస్తే జగన్ గారు ఎంత పెద్ద సంఘ సంస్కర్తో అర్దమవుతున్నదని వివరించారు. సమావేశంలో పలు కార్పోరేషన్ల ఛైర్మన్లు జగన్ గారు అమలు చేస్తున్న పధకాలు బిసి,ఎస్సి,ఎస్టి,మైనారిటీ కార్పోరేషన్ల పరిధిలో ఏ విధంగా ప్రయోజనం కలిగిస్తున్నాయో వివరించారు.