రాజమండ్రి: సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ప్రతి ఒక్కరి ముఖాల్లో చిరునవ్వు, ఆనందం కనిపిస్తున్నాయని డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు తెలిపారు. పెంచిన పెన్షన్లు పంపిణీ, రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. బూడి ముత్యాలనాయుడు ఏమన్నారంటే... అందరికీ నమస్కారం, అన్నా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గడప గడపకు వెళ్ళేటప్పుడు రూ. 2,750 పెన్షన్ మీ మనవడు ఇవ్వబోతున్నాడు అని చెప్పినప్పుడు అవ్వాతాతల కళ్ళలో ఆనందం, చిరునవ్వు చూసినప్పుడు చాలా ఆనందం వేసింది. అంతేకాక వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాలు అందిస్తున్నప్పుడు ప్రతి అక్కచెల్లెమ్మ మీ జగనన్న ఈ పథకాలు ఇస్తున్నారన్నప్పుడు కూడా వారి ముఖాల్లో చిరునవ్వు, ఆనందం కనిపిస్తున్నాయి. స్కూల్‌కి వెళ్ళే చిన్నారులు కూడా మా జగన్ మామ అభివృద్ది చేశారన్నప్పుడు చాలా గర్వంగా అనిపించింది, మా అమ్మ ఖాతాలో కూడా రూ. 15 వేలు మా జగన్ మామ వేశారంటున్నప్పుడు చాలా ఆనందం వేసింది. అంగన్‌వాడీ సెంటర్‌లో కూడా చిన్నారులు మా జగన్ మామ మాకు పంపుతున్నారు ఇక్కడ మాకు పెడుతున్నారంటున్నారు. ధ్యాంక్యూ. దేవుడెలా ఉంటాడని ఎవరైనా అడిగితే జగనన్నలా ఉంటాడని.. కోటా సామ్రాజ్యం, వితంతు పెన్షన్ లబ్ధిదారు, రాజమండ్రి మున్సిపల్ కాలనీ జగనన్నా నమస్కారం, గత ప్రభుత్వంలో నా భర్త చనిపోతే ఎవరూ పట్టించుకోలేదు, నాకు ఇద్దరు పిల్లలు, గతంలో జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగేవాళ్ళం, పెన్షన్ కోసం రోజూ తిరిగేవాళ్ళం, బీమా కూడా రాలేదు, ఎవరూ పట్టించుకోకపోవడంతో తిరిగి తిరిగి మాకే విసుగొచ్చింది. మీరు సీఎం అయిన తర్వాత వాలంటీర్ నేరుగా మా ఇంటికే వచ్చారు, నేను దరఖాస్తు చేయగానే నాకు నెల రోజులకే వచ్చింది, వచ్చిన వెంటనే ప్రతి నెలా మొదటి తారీఖునే కోడి కూయకముందే వాలంటీర్ వచ్చి మా చేతిలో పెన్షన్ డబ్బులు పెడుతున్నారు, ఆ డబ్బు మా కుటుంబానికి చాలా ఉపయోగపడుతుంది. నా పెద్ద కొడుకు కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు, ఏడాదికి విద్యా దీవెన కింద రూ. 75 వేలు, వసతి దీవెన కింద రూ. 20 వేలు చొప్పున నాలుగేళ్ళకు రూ. 3,80,000 లక్షలు లబ్ధిపొందే అవకాశం, చిన్న కొడుక్కి ఏడాదికి రూ. 15,000 చొప్పున రెండేళ్ళకు రూ. 30,000 అమ్మ ఒడి లబ్దిపొందాను. మా పిల్లలను మీరు మామయ్యలా చదివిస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. నాకు ఇల్లు లేదు, సొంతింటి కల ఊహ అనుకున్నాం, కానీ మీరు ఇళ్ళ పట్టా ఇచ్చారు, ఇల్లు కట్టుకుంటున్నాం, మా కల నెరవేరింది, నా కుమారుడికి యాక్సిడెంట్ అయితే నాకంటే ముందే 108 వచ్చి ఆసుపత్రిలో చేర్చింది, తర్వాత నేను వెళితే ఆపరేషన్ చేయాలన్నారు, మీకు ఆరోగ్యశ్రీ ఉందా అని అడిగితే ఉందనగానే నేను కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స చేయించాను, ఆ సమయంలో ఆరోగ్యశ్రీ కింద పూర్తిగా అంతా వారే చూసుకున్నారు. నా భర్త లేరనే భాద ఉండేది, నేను కూడా లేకపోతే నా పిల్లలు ఏమవుతారని భయం ఉండేది కానీ ఇప్పుడు మా జగనన్న ఉన్నారు, వారిని బాగా చదివించి మంచి భవిష్యత్ ఇస్తారనే ధైర్యం వచ్చింది. ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేను, నాలాంటి పేద అభాగ్యులను మీరు ఆదుకుంటున్నారు. ధన్యవాదాలు అన్నా, దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి, మా గురించి ఇంతలా ఆలోచించే అన్నయ్య ఉన్నారని భరోసానిచ్చారు. నేను ఎప్పుడూ ఒక పాట పాడుకుంటాను, దేవుడెలా ఉంటాడని ఎవరైనా అడిగితే నా అన్నలా ఉంటాడని అంటాను నేను...నిజంగా మీరు మాకు దేవుడే అన్నా, ధన్యవాదాలు.