వ్యాక్సిన్‌ ముఖ్యమా..? ఎన్నికలు ముఖ్యమా..?

నిమ్మగడ్డకు డిప్యూటీ సీఎం నారాయణస్వామి సూటి ప్రశ్న

తిరుపతి: చంద్రబాబు మెప్పుపొందేందుకు, టీడీపీకి లాభం చేకూర్చాలని, ఒక కులానికి మేలు చేయాలని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఆలోచన చేస్తున్నారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి విమర్శించారు. కరోనా సెకండ్‌ స్టేజ్‌ అని కేంద్ర హెచ్చరిస్తున్న సమయంలో.. హడావుడిగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. తిరుపతిలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు పెట్టినా వైయస్‌ఆర్‌ సీపీ క్లీన్‌స్వీప్‌ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలంతా సీఎం వైయస్‌ జగన్‌ వెంటే ఉన్నారని, తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవన్నారు. ప్రజలు, ఉద్యోగులు, సిబ్బంది ఆరోగ్య భద్రత దృష్ట్యా ఎన్నికలు ఇప్పుడు వద్దనేది ప్రభుత్వ ఉద్దేశమన్నారు. 

ప్రభుత్వం సూచన కంటే.. తన కులస్తుడు చంద్రబాబు చెప్పినట్లు నడుచుకోవాలనే దృక్పధంతో నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ప్రవర్తిస్తున్నారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అననారు. ప్రస్తుత పరిణామంలో వ్యాక్సిన్‌ ముఖ్యమా..? ఎన్నికలు ముఖ్యమా..? ‌అని నిమ్మ‌గ‌డ్డ‌ను ప్ర‌శ్నించారు. గౌర‌వ న్యాయ‌స్థానం కూడా బాగా ఆలోచన చేసి మంచి తీర్పు ఇవ్వాలని కోరారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top