విద్యార్థుల చదువుకు ఖర్చు పెడుతున్నా ఏడుపేనా రామోజీ, రాధాకృష్ణా..?

 డిప్యూటీ సిఎం నారాయణస్వామి

చిత్తూరు:   ప్ర‌భుత్వం విద్యార్థుల చదువుకు ఖర్చు పెడుతున్నా ఏడుపేనా రామోజీ, రాధాకృష్ణా..? అని డిప్యూటీ సిఎం నారాయణస్వామి ప్ర‌శ్నించారు. చిత్తూరు జిల్లా కార్వేటినగరంలో ట్యాబుల పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు ఆలోచన ఒక్కటే..భగవంతుడు మనకు సేవ చేసే అవకాశం ఇచ్చాడు..ఆ అవకాశాన్ని పేదరికం పారద్రోలడానికి వినియోగించాలి. ఆ పేదరికాన్ని పోగొట్టాలంటే విద్య ఒక్కటే ఆయుధం. రామోజీరావు, రాధాకష్ణలకు విజ్ఞప్తి చేస్తున్నా...అయ్యా రామోజీరావు, రాధాకృష్ణా..  చదువుకునే బిడ్డలపై ఖర్చు పెట్టేదానిపై ఏడ్వవద్దు. రామోజీరావు, రాధాకష్ణలు రాక్షస మనస్తత్వంతో వ్యవహరిస్తున్నారు. బిడ్డలకు పుస్తకాలు, షూలు ఇచ్చి... అన్నం పెట్టి చదివించేందుకే అమ్మ ఒడి అని తెలుసుకోండి. సమాజాన్ని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని చంద్రబాబు, ఎల్లో మీడియాకు చెందిన రామోజీ, రాధాకృష్ణలు కంకణం కట్టుకున్నారు.  మీ కుట్రలు వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డిగారి పరిపాలనలో సాగవని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి హెచ్చరించారు.

తాజా వీడియోలు

Back to Top