చంద్రబాబును శునకంతో కూడా పోల్చలేం

బాబుకు దమ్ముంటే కుప్పం వెళ్లి గెలిచిన వారి ఫొటోలు చూపించగలడా..?

టీడీపీ పతనానికి ఎల్లో మీడియా కారణం

చంద్రబాబుకు కాగితాలు చుట్టుకునేంత పిచ్చిముదరాలని కోరుకుంటున్నా..

జనమంతా జగనన్నను గుండెల్లో పెట్టుకొని గెలిపించారు

డిప్యూటీ సీఎం, ఎక్సైజ్‌ శాఖ మంత్రి నారాయణస్వామి

తిరుపతి: సంక్షేమ పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని జనమంతా గుండెల్లో పెట్టుకున్నారని, సీఎం అందిస్తున్న సంక్షేమ పథకాలే పంచాయతీ ఎన్నికల్లో విజయాన్ని తెచ్చిపెడుతున్నాయని డిప్యూటీ సీఎం, ఎక్సైజ్‌ శాఖ మంత్రి నారాయణస్వామి అన్నారు. డైరెక్ట్‌గా పేదవారి బ్యాంక్‌ ఖాతాల్లోకి సంక్షేమ పథకాల నగదు అందించిన ముఖ్యమంత్రిగా దేశ చరిత్రలో నిలిచారన్నారు. కులం, మతం, పార్టీ, ప్రాంతం చూడకుండా పేదరికమే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని, నవరత్నాలు ప్రతి ఇంటికి చేరాయన్నారు. 

తిరుపతిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ.. శకుని మాదిరిగా చంద్రబాబుకు రెండు పేపర్లు దొరికాయని, శకున్ని నమ్ముకొని దుర్యోధనుడు ఏ విధంగా సర్వనాశనం అయిపోయాడో.. ఆ విధంగా ఎల్లో మీడియాను నమ్ముకొని చంద్రబాబు పతనమయ్యాడన్నారు. కుప్పం నియోజకవర్గాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చాలెంజ్‌గా తీసుకొని 89 పంచాయతీలు ఎన్నికలు జరిపించారన్నారు. ఓటర్ల తీర్పు కోరి.. 89 స్థానాల్లో 74 వైయస్‌ఆర్‌ సీపీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారని చెప్పారు. 

స్వర్గీయ ఎన్టీఆర్‌ ఫొటో పెట్టుకొని కుప్పం ప్రజలను ఇన్నేళ్లుగా చంద్రబాబు మోసం చేశాడని మంత్రి నారాయణస్వామి మండిపడ్డారు. బాబును కుప్పానికి రాకుండా చేయాలనే ధృడ సంకల్పంతో విజయం సాధించామన్నారు. బీసీలకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రాధాన్యత ఇచ్చారని గుర్తుచేశారు. 

చంద్రబాబుకు పిచ్చి బాగా ముదిరి కాగితాలు చుట్టుకొని తిరిగేలా చేయాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నానని మంత్రి నారాయణస్వామి చురకంటించారు. బాబు నోరు తెరిస్తే అబద్ధాలేనని, ఇళ్ల స్థలాలు ఇచ్చినా, ఇంగ్లిష్‌ మీడియం తీసుకొచ్చినా, పాఠశాలలు, ఆస్పత్రులను ‘నాడు–నేడు’తో అభివృద్ధి చేస్తున్నా.. చంద్రబాబుకు కడుపుమండి కోర్టుకు వెళ్లి అడ్డుకుంటున్నాడని ధ్వజమెత్తారు. చిత్తూరు జిల్లాలో ఎంత మంది గెలిచారో.. ఎంత మెజార్టీ వచ్చిందో ఫొటోలు తీసి చూపిస్తామన్నారు. 

చంద్రబాబుకు దమ్మూ, ధైర్యం ఉంటే కుప్పానికి వెళ్లి టీడీపీ మద్దతుదారులు ఎంతమంది గెలిచారో ఫొటోలు చూపించాలని మంత్రి నారాయణ స్వామి సవాల్‌ విసిరారు. చంద్రబాబును కుక్కతో కూడా పోల్చలేము. శునకానికి విశ్వాసం ఉంటుందని, చంద్రబాబుకు కోటీశ్వర్లపైన, వెన్నుపోటుదారులపై విశ్వాసం ఉందన్నారు. సీఎం వైయస్‌ జగన్‌కు ప్రజల మీద, తండ్రి ఆశయాలు సాధించాలనే విశ్వాసం ఉందని చెప్పారు. 

Back to Top