చంద్రబాబు, లోకేష్‌ కంటే పెద్ద సైకోలు ఎవరూ లేరు

డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు

చంద్రబాబుకు ప్రజా సంక్షేమం అవసరం లేదు

గత ప్రభుత్వానికి, ఇప్పటి ప్రభుత్వానికి తేడా చూడండి

జన్మభూమి కమిటీల పేరుతో గత ప్రభుత్వం దోచుకుంది

అయ్యన్నపాత్రుడికి పిచ్చి పట్టిందా?

సీఎం వైయస్‌ జగన్‌ సంక్షేమ పాలన చూసి ఓర్వలేకపోతున్నారు. 

తాడేపల్లి:  చంద్రబాబు, లోకేష్‌ల కంటే పెద్ద సైకోలు ఎవరూ ఉండరని డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు ముత్యాల నాయుడు విమర్శించారు. వాళ్లిద్ద‌రిని మించిన సైకో అయ్య‌న్న‌పాత్రుడ‌ని దుయ్య‌బ‌ట్టారు.టీడీపీ నేతలు పిచ్చిపట్టి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.వారికి ప్రజా సమస్యలు పట్టవని, ఉనికి కోసం పిచ్చి ప్రేలాపనలు చేస్తుంటారని ఫైర్‌ అయ్యారు. మూడున్నరేళ్లలో ప్రజల కోసం ఎప్పుడైనా చంద్రబాబు మాట్లాడారా అని నిలదీశారు. టీడీపీ నేత అయ్యన్నపాత్రుడికి పిచ్చి పట్టిందా అని మండిపడ్డారు. పార్టీలతో సంబంధం లేకుండా అర్హులందరికీ సంతృప్తస్థాయిలో సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు.

 •  మీరే సైకోలు:
      రాష్ట్రంలో మాజీ మంత్రులు కొందరి మాటలు వింటుంటే, వారు మానసిక పరిస్థితి బాగాలేదని అర్ధం అవుతోంది. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు గతి తప్పి మరీ సీఎంగారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు. గతంలో మంత్రిగా, ఎంపీగా పని చేసిన అయ్యన్నపాత్రుడు చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు. సైకో అన్న మాటకు నీకు నిజంగా అర్ధం తెలిసి ఉంటే.. చంద్రబాబు సైకో. ఆయన కొడుకు లోకేష్‌ సైకో. నీవొక సైకోవు. నీవు ఏ నాడైనా రాష్ట్ర ప్రజలకు అవసరమైన అంశాన్ని ప్రస్తావించావా? ప్రజల కోసం మాట్లాడావా? రాష్ట్రం మేలు కోసం ఏనాడైనా ఒక సూచన, సలహా ఇచ్చారా? ఆలోచించండి. మీ మాటల్లో సైకో విధానం ఉంది. మీ మాటల్లో అభద్రతా భావం కనిపిస్తోంది.

  ఆనాడు పరిహసించారు:
      మీరు అధికారంలో ఉన్నప్పుడు మేము అసెంబ్లీలో ప్రజా సమస్యలు ప్రస్తావిస్తే.. అప్పుడు కూడా మీరు ఇదే విధంగా పరిహసించి విమర్శలు చేశారు.. ఆరోజు మీ మాటలు, ఇవాళ్టి మాటలు, మీ వ్యవహారశైలిని ప్రజలు గమనిస్తున్నారు.

  అందరినీ మోసం చేశారు:
      మీరు జన్మభూమి కమిటీల ద్వారా ఇష్టారాజ్యంగా దోపిడి చేశారు. నీరు చెట్టు కార్యక్రమం ద్వారా యథేచ్ఛగా దోచుకున్నారు. మీరు అధికారంలోకి రావడానికి రైతులు, డ్వాక్రా అక్క చెల్లెమ్మలు, యువతకు మాయమాటలు చెప్పి మోసం చేశారు. రైతులు, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేయలేదు. ఆరోజు మీ మాటలు నమ్మిన వారంతా దారుణంగా మోసపోయారు. మీరు రైతులు, డ్వాక్రా మహిళలతో పాటు, నిరుద్యోగ యువతను కూడా వంచించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదు. అప్పుడు వారంతా బాధ పడుతుంటే, అయ్యన్నపాత్రుడు, లోకేష్, చంద్రబాబు నవ్వుకున్నారు. అందుకే మీరు సైకోలు.

  జుగుప్సాకరంగా మాటలు:
      మీ మాటలు ఉచ్ఛరించాలంటే మాకే భయంగా ఉంది. అంత జుగుప్సాకరంగా మీ మాటలు ఉన్నాయి. ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు. అందుకే మీరు గత 5 ఏళ్లలో చేసిన పాపాలకు మీకు తగిన బుద్ధి చెప్పారు. మీరు మా పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొన్నారు. గత ఎన్నికల్లో మీకు ప్రజలు సరిగ్గా అవే సీట్లు ఇచ్చారు. 

  అయ్యన్నకు పిచ్చి పట్టిందా?:
      అయ్యన్నపాత్రుడు ఇష్టానుసారం మాట్లాడుతున్నాడు. ఆ మాటలు వింటుంటే ఆయనకు నిజంగా పిచ్చి పట్టిందా? అనిపిస్తుంది. ఇప్పటికే "ఎన్నికలు పూరైనట్లు... తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినట్లు. ఆయనకు హోం మంత్రిగా బాధ్యతలు ఇచ్చినట్లు" మాట్లాడుతున్నాడు. ఏమిటా పిచ్చి మాటలు?
      పోలీసులు ప్రజల భద్రత కోసం పని చేస్తారు. అలాగే చేస్తున్నారు. 
  టీడీపీ సభలు పెట్టుకుంటే మేము భయపడాల్సిన అవసరం లేదు. ఆ పార్టీకి ప్రజాదరణ లేదు. అందుకే ఇరుకు సందుల్లో సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి, పెద్ద సంఖ్యలో ప్రజల వచ్చినట్లు చూపే ప్రయత్నం చేస్తున్నారు. అలా చేయడం వల్లనే కందుకూరు, గుంటూరులో తొక్కిసలాట జరిగి 11 మంది అమాయకులు బలయ్యారు.
      దీంతో ప్రజల భద్రత కోసం పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం కూడా ప్రజల భద్రత, రక్షణ కోసమే జీఓ జారీ చేసింది. అంతే తప్ప, టీడీపీ వారికి భయపడి ఆ నిర్ణయం తీసుకోలేదు.

  అయ్యన్న మాటలు వారిని వణికిస్తున్నాయి:
      కానీ అయ్యన్నపాత్రుడు మాటలు వింటుంటే.. తాను హోం మంత్రి అయినట్లు, పోలీసులపై చర్యలు తీసుకుంటామని, వారిని లాకప్‌లో పెడతామని.. పిచ్చి ప్రేలాపనలు. సైకో మాదిరిగా మాట్లాడుతున్నాడు.
   ఇప్పుడే పోలీసులను ఆ మాటలు అంటుంటే.. ఇక తమతో ఎలా వ్యవహరిస్తారో అని ప్రజలు అనుకుంటున్నారు. చర్చించుకుంటున్నారు. తమను ఎలా చిత్ర హింసలు పెడతారోఅని భయపడుతున్నారు. అయ్యన్నపాత్రుడు మాటలు, ప్రవర్తన చూస్తుంటే.. ఆయనకు మతి భ్రమించింది అనిపిస్తుంది.

  ఆ వ్యవస్థలపై ఎందుకంత అక్కసు?:
      మా నాయకుడు విపక్షనేతగా ఉన్నప్పుడు సుదీర్ఘ పాదయాత్ర చేసి, ప్రజల కష్టాలు స్వయంగా చూశారు. అధికారంలోకి రాగానే ప్రజలందరికీ ఎంతో మేలు చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేస్తే, దాన్ని కూడా విమర్శిస్తున్నారు. ప్రతి నెలా 1వ తేదీనే ఇంటి తలుపు తట్టి, పెన్షన్‌ ఇస్తున్నందుకు వలంటీర్లను తప్పు పడుతున్నారా?
      ప్రజలకు ఇంటి గడప వద్దనే పాలన అందిస్తున్న, పథకాలు అందేలా చూస్తున్న సచివాలయాలు ఏర్పాటు చేసినందుకా.. ఆ వ్యవస్థను తప్పు పడుతున్నారు. సచివాలయాల్లోనే ప్రజలకు కావాల్సిన అన్ని సర్టిఫికెట్లు ఇస్తున్నారు. ఇది తప్పా? ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ పని చేయడం తప్పా? వీటన్నింటినీ ప్రజలు ఆదరిస్తున్నారు. అందుకే వలంటీర్లపై మీరు విషం చిమ్ముతున్నారు.

  మీ పార్టీ వారే భయపడుతున్నారు:
      మీ పాలనలో జన్మభూమి కమిటీలు యథేచ్ఛ దోపిడి చేసి, గ్రామ స్థాయి నుంచి సీఎం స్థాయి వరకు ఆ లంచాలు పంచారు. మీరు ఆ స్థాయిలో ప్రజలను వేధించారు కాబట్టే, గత ఎన్నికల్లో ప్రజలు మీకు తగిన బుద్ధి చెబుతారు.
      ఇవాళ అయ్యన్నపాత్రుడు మాటలు వింటుంటే ప్రజలంతా ఇదేం ఖర్మ అనుకుంటున్నారు. టీడీపీ మద్దతుదారులు కూడా ఆ పార్టీ నేతలను చూసి భయపడుతున్నారు. వారు తమ గ్రామానికి వస్తుంటే, ఇళ్లలో దాక్కుంటున్నారు. ఎందుకంటే.. వారికి అర్హత ఉంటే, అన్ని పథకాలు అందుతున్నాయి. ఎక్కడా పార్టీ అనేది చూడడం లేదు. అందుకే వారు తమ పార్టీ నేతల వెంట వెళ్లడానికి ముందుకు రావడం లేదు.
      సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ పాలనలో ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. తమ పార్టీ నేతల మాటలు విని, వారి వెంట వెళ్తే నష్టపోతామని విపక్ష మద్దతుదార్లు కూడా అనుకుంటున్నారు.

  అయ్యన్న సంధి ప్రేలాపనలు:
      అందుకే అయ్యన్నపాత్రుడు ఇకనైనా రెచ్చగొట్టే మాటలు వీడాలి. ఆయన మాటతీరు చాలా అసభ్యకరంగా ఉంది. ఆయన మాటలు దారుణంగా ఉంటున్నాయి..
  మీ పార్టీ నాయకుడు చంద్రబాబు, ఆయన కుమారుడు హైదరాబాద్‌లో దాక్కుని, అప్పుడప్పుడు వచ్చి పోతున్నారు.
      మా నాయకుడు నీ నర్సీపట్నం కూడా వచ్చారు. నర్సీపట్నం నడిబొడ్డులో మీటింగ్‌ పెట్టారు. ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.అది చూసి మీ మతి భ్రమించింది కాబట్టే, అక్కడ గెల్చే అవకాశం లేదని తేలడంతో సంధి ప్రేలాపనలు పేలుతున్నావు.

  కుప్పంలోనూ మానేతకు బ్రహ్మరథం:
      కుప్పంలో కూడా మా నాయకుడిని ప్రజలు అఖండ రీతిలో ఆదరించారు. ఆయన సమావేశానికి వచ్చిన ప్రజలను చూసిన చంద్రబాబుకు చెమటలు పట్టాయి. కుప్పం నియోజకవర్గంలో జరిగిన అన్ని స్థానిక ఎన్నికల్లో మా పార్టీకి ఘన విజయం కట్టబెట్టారు. ఇన్నేళ్లలో కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు చేసిందేమీ లేదు. మా ప్రభుత్వం వచ్చాకే అక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.
      మా నాయకుడు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నారు. అందుకే ఆయన ఎక్కడికి పోయినా, బ్రహ్మరథం పడుతున్నారు. అందుకే 2024 ఎన్నికల్లో కూడా మళ్లీ మా పార్టీదే విజయం. ఇవన్నీ మీకూ అర్థం అయ్యాయి కాబట్టే.. మతి భ్రమించి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు.
  గడప గడపకూ కార్యక్రమంలో ప్రజలు మమ్మల్ని ఎంతో ఆదరిస్తున్నారు. ప్రభుత్వం తమకు చేసిన మేలు చెబుతున్నారు.

  అయ్యన్నా.. నోరు అదుపులో పెట్టుకో:
      అందుకే అయ్యన్నా ఇకనైనా నీ నోరు అదుపులో పెట్టుకో. మాట్లాడితే భారతి సిమెంట్‌ గురించి విమర్శలు చేస్తున్నావ్ . సిమెంటు ధరలు పెంచడానికి రాష్ట్రంలో ఒక్క భారతి సిమెంట్‌ కంపెనీ మాత్రమే లేదు. ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి. వారూ రేట్లు పెంచుతున్నారు.
      మీ నాయకుడికి హెరిటేజ్ సూపర్‌ మార్కెట్‌ ఉంది. అందులో రేట్లు ఎలా ఉన్నాయో మీకు తెలియదా? దాని గురించి మాట్లాడరా? మీ మార్కెట్‌లో ఇష్టానుసారం ధరలు పెంచి, ప్రజలను దోచుకుంటున్నారు. 
      అయ్యన్నా.. ఒంటి మీద తెలివి ఉంచుకుని మాట్లాడాలి. మేము కూడా కావాలంటే నీ మాదిరిగా మాట్లాడగలం. కానీ అది సబబు కాదని మేము మాట్లాడడం లేదు.
      మీకు ఇంకా నిజంగా బలం ఉంటే, స్థానిక ఎన్నికల్లో పోటీ నుంచి ఎందుకు తప్పుకున్నారు. కుప్పంలో స్థానిక ఎన్నికల్లో చిత్తుగా ఎందుకు ఓడిపోయారు? వచ్చే ఎన్నికల్లో మీకు మళ్లీ పరాభవం తప్పదు. మీకు ఓటమి ఖాయం.  అయ్యన్నను మానసిక వైద్యుడికి చూపిస్తే మంచిది.

   
  అందుకే మాట్లాడాల్సి వస్తోంది:
      శాఖ పరంగా మేము చేయాల్సిన పనులన్నీ చేస్తున్నాం. అన్నీ సకాలంలో జరుగుతున్నాయి. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. కానీ మాపై నిత్యం చంద్రబాబునాయుడు, ఆ పార్టీ నేతలు, మాజీ మంత్రులు ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నారు కాబట్టే, మేము మంత్రులు మాట్లాడాల్సి వస్తోంది. సర్పంచ్‌లకు నిధులు, విధులు అందుతున్నాయి. వారికి మొన్ననే జీతాలు కూడా చెల్లించాము. గ్రామాల్లో అభివృద్ధి పనులు యథావిథిగా కొనసాగుతున్నాయి. పనుల్లో ఎక్కడా వివక్ష చూపడం లేదు.

Back to Top