అలాంటి వారిని చీపుర్లు, చెప్పుల‌తో త‌రిమి త‌రిమి కొట్టండి

డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా
 

కర్నూలు:  ఒకే ప్రాంతం అభివృద్ధి చెందాల‌ని చెప్పే టీడీపీ, జ‌న‌సేన నాయ‌కులు మీ గ‌డ‌ప వ‌ద్ద‌కు వ‌స్తే వారిని ఆడ‌వాళ్లు చీపుర్లు, మ‌గ‌వాళ్లు చెప్పులు ప‌ట్టుకొని త‌రిమి త‌రిమి కొట్టాల‌ని డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా పిలుపునిచ్చారు. మూడు ప్రాంతాలకు సమన్యాయం చేయాలనే సీఎం వైయ‌స్ జగన్‌ ముందకెళ్తున్నార‌ని చెప్పారు. ప్రజలకు ద్రోహం చేయాలని చంద్రబాబు చూస్తున్నార‌ని అంజాద్ బాషా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సోమ‌వారం క‌ర్నూలులో నిర్వ‌హించిన రాయ‌ల‌సీమ గ‌ర్జ‌న కార్య‌క్ర‌మంలో అంజాద్‌బాషా మాట్లాడారు. 

వికేంద్రీకరణకు మద్దతుగాఇవాళ కర్నూలు నగరంలో రాయలసీమ గర్జనకు వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ వికేంద్రీకరణ, మూడుప్రాంతాలకు సమన్యాయం చేయాలన్న ఆలోచనలో భాగంగా సీఎం వైయస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయం. అనేక దశాబ్ధాలుగా రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని ఆనాడు పెద్దలందరూ కూర్చొని ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. శ్రీభాగ్‌  ఒప్పందం ప్రకారం రాయలసీమకు రాజధాని ఇవ్వాలని, లేనిపక్షంలో ఇక్కడ హైకోర్టు ఏర్పాటు చేయాలని ఆ రోజు ఒప్పందం చేసుకున్నారు. అప్పటి ఒప్పందం మూలనపడితే..సీఎం వైయస్‌ జగన్‌ తెరపైకి తీసుకువచ్చారు. అన్ని ప్రాంతాలకు సమ న్యాయం చేయాలనే ఆలోచనతో సీఎం వైయస్‌ జగన్‌ అడుగులు ముందుకు వేస్తున్నారు. కర్నూలుకు న్యాయ రాజధాని, వైజాగ్‌లో పరిపాలన రాజధాని, అమరావతిలో శాసన రాజధాని ఏర్పాటు చేయాలని మూడు ప్రాంతాలకు సమన్యాయంతో ముందుకు వెళ్తున్నారు. అన్యాయం జరిగిన ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడి ప్రజలతో, టీడీపీ నాయకులతో ఒకే రాజధాని, ఒకే ప్రాంతం అభివృద్ధి అంటూ నినాదాలు చేయించడం, ఈ ప్రాంతాన్ని చిన్న చూపు చూస్తూ అవహేళనగా మాట్లాడటం ఎంత వరకు న్యాయం. ఇది ఉద్యమం..ఉద్యమం ఆరంభమైంది. కచ్చితంగా జేఏసీకి మద్దతుగా నిలుస్తూ వైయస్‌ఆర్‌సీపీకి సపోర్టు చేస్తుంది. అందరం కలిసికట్టుగా కృషి చేస్తూ న్యాయ రాజధానిని సాధిద్ధామని పిలుపునిచ్చారు. 29 గ్రామాలు అభివృద్ధి చేయాలని చంద్రబాబు ఆలోచన చేస్తుంటే..వైయస్‌ జగన్‌ 26 జిల్లాలు అభివృద్ధి చేయాలని అడుగులు ముందుకు వేస్తున్నారు. మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని వైయస్‌ జగన్‌ కృషి చేస్తున్నారు. మీరందరూ కూడా వైయస్‌ జగన్‌కు, ప్రభుత్వానికి అండగా నిలవాలి. ఒకే ప్రాంతం అభివృద్ధి చెందాలని చెబుతున్న నాయకులు మీ గడపకు వస్తే ఏం చేస్తారు. మహిళలు చీపుర్లు పట్టుకోవాలి. మగవాళ్లు చెప్పులు పట్టుకుని తరిమితరిమి కొట్టాలని డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా పిలుపునిచ్చారు. 
 

తాజా వీడియోలు

Back to Top