అణ‌గారిన వ‌ర్గాల‌కు ఆర్థిక, రాజ‌కీయ‌ స్వావ‌లంబ‌న‌

వైయ‌స్ జ‌గ‌న్ మ‌రో 30 ఏళ్లు సీఎంగా ఉంటే పేదరికం అనేదే ఉండదు

వైయ‌స్ఆర్ సీపీ పాల‌న‌లో ముస్లిం మైనార్టీల‌కు పెద్ద‌పీట‌

సామాజిక న్యాయ‌భేరి బ‌స్సుయాత్ర‌లో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా

నంద్యాల‌: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తన పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు పెద్దపీట వేశార‌ని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తెలిపారు. ప్రతి పదవుల్లోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల‌కు 50శాతం కంటే ఎక్కువ‌గా రిజర్వేషన్‌ కల్పిస్తున్న ముఖ్య‌మంత్రికి ప్రతి ఒక్కరు అండగా ఉండాల‌న్నారు. నంద్యాల‌లో నాల్గ‌వ రోజు బ‌స్సుయాత్ర ప్రారంభం సంద‌ర్భంగా మంత్రి అంజాద్ బాషా ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడారు. ఒక పక్క బడుగు, బలహీనవర్గాల వారిని రాజ్యాధికారం వైపు నడిపిస్తూ.. మరోవైపు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ వారికి ఆర్థిక స్వావలంబ‌న కల్పిస్తున్నారని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‌లోనే సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి. ఒకపక్క కరోనా మహమ్మారితో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయినా ఎక్కడా సంక్షేమ పథకాలు అమలు నిలిచి పోకుండా  క్యాలెండర్‌ ప్రకారమే అమలు చేసిన ఘనత  ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌కే ద‌క్కుతుంద‌న్నారు. 

చంద్రబాబు టీడీపీ మహానాడు పేరుతో కొందరు జోకర్లు, బ్రోకర్లను పక్కన పెట్టుకొని ప్రభుత్వాన్ని తిట్టించే ప్రయత్నం చేస్తున్నార‌ని మంత్రి అంజాద్ బాషా ధ్వ‌జ‌మెత్తారు. బీసీలు మా పార్టీ పేటెంట్‌ అని, చంద్రబాబు 14ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి వారి అభివృద్ధికి చేసింది శూన్యమ‌న్నారు. వాళ్లను ఓటుబ్యాంకు రాజకీయాలకు వాడుకుని గద్దెనెక్కార‌ని, అంతేకాకుండా మైనార్టీలను చిన్నచూపు చూశారని గుర్తుచేశారు. చంద్ర‌బాబు హయాంలో మైనార్టీలకు,  ఎస్టీలకు క్యాబినెట్‌లో అవ‌కాశం కూడా ఇవ్వ‌లేద‌ని చెప్పారు. చంద్రబాబుకు నంద్యాల ఉప ఎన్నికల్లోనే కనువిప్పు కలిగింద‌ని, ఉప ఎన్నికల్లో గెలవాలంటే మైనార్టీ ఓట్లు అవసరం అని గుర్తించిన చంద్రబాబుకు ఎండీ ఫరూఖ్‌ అప్పుడు గుర్తుకు వచ్చార‌ని, అంతవరకూ వారికి అపాయింట్‌మెంట్‌ ఇచ్చిన పాపాన పోలేదన్నారు. అదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తొలిసారి తనకు మంత్రివర్గంలో స్థానం కల్పించడమే కాకుండా, ఉప ముఖ్యమంత్రిని చేసిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంద‌న్నారు. 

అలాగే నలుగురు మైనార్టీలకు ఎమ్మెల్యేలలుగా అవకాశం ఇచ్చారన్నారు. శాసనమండలిలోనూ నలుగురు మైనార్టీలకు అవకాశం ఇచ్చిన ప్రభుత్వం వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీదేన‌ని, మైనార్టీ మహిళను శాసనమండలి డిప్యూటీ స్పీకర్‌గా నియమించిన ఘనత కూడా ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌కే ద‌క్కుతుంద‌న్నారు. మైనార్టీలంతా వైయస్సార్‌ సీపీకి అండగా ఉండాల‌ని కోరారు. రాజకీయ పార్టీలన్నీ ఏకమై రాష్ట్ర ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నాయ‌ని, రాబోయే రోజుల్లో శ్రీలంక తరహాలో తయారు అవుతుందంటూ ఆరోపణలు చేస్తున్నాయ‌ని మండిప‌డ్డారు. లక్షా 40 వేల కోట్లు రూపాయలు మధ్యవర్తులు, దళారులు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే నగదు జమ చేస్తున్న ప్రభుత్వంపై బురదచల్లే కార్యక్రమం చేస్తున్నారని ధ్వ‌జ‌మెత్తారు. టీడీపీ, ఎల్లోమీడియా విష ప్రచారాన్ని ప్రజలు నమ్మరని స్ప‌ష్టం చేశారు. 

అణగారిన వర్గాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు గౌరవాన్ని ఇచ్చిన ఈ ప్రభుత్వానికి, వైయ‌స్ జగన్‌కు అండగా ఉండాల్సిన అవసరం ఉంద‌న్నారు. వైయ‌స్‌ జగన్‌ ఈ రాష్ట్రానికి 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటే పేదరికం అనేదే ఉండదన్నారు. బడుగు, బలహీన వర్గాలకు పూర్తిగా న్యాయం జరుగుతుంద‌ని మంత్రి అంజాద్ బాషా చెప్పారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top