రైతులకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వం

డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా

వైయస్‌ఆర్‌ జిల్లా: కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా అన్నారు. కడప నగరంలో డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా పర్యటించారు. ఈ సందర్భంగా పాత కడప మున్సిపల్‌ హైస్కూల్‌లో రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. అనంతరం అంజాద్‌ బాషా మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రైతులకు అండగా ఉండేందుకు ఈ నెల 15న రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టనుందన్నారు. అలాగే మే18 నుంచి వేరుశనగ విత్తనాలను కూడా పంపిణీ చేయనున్నట్లు అంజాద్‌ బాషా తెలిపారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top