ఆరు నెలల్లోనే చ‌రిత్రాత్మ‌క‌ నిర్ణయాలు

దిశ చట్టంతో మహిళలకు మేలు

కేబినెట్‌లో 60 శాతం పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల‌కే

జలయజ్ఞం సభలో డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా

వైఎస్సార్‌ జిల్లా: రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటి సారి మైనార్టీ వర్గాలకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చిన ఘన త వైఎస్‌ జగన్‌కే దక్కుతుందని అంజాద్‌ బాషా అన్నారు. ఆయన రాయచోటిలో మంగళవారం జరిగిన జలయజ్ఞం సభలో పాల్గొన్నారు. రాయచోటి పట్టణ అభివద్ధికోసం రూ.2వేల కోట్లు కేటాయించి పెద్ద మనసు చాటుకున్నారని అన్నారు. కేబినేట్‌లో 60 శాతం పదవులు అణగారిన వర్గాలకే కేటాయించారని గుర్తు చేశారు. సీఎం అయిన ఆరు మాసాల్లోనే చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారి కొనియాడారు. దిశ చట్టం వల్ల మహిళలకు మేలు జరుగుతుందన్నారు. సీఎంగా సంతకం చేసిన మొదటి రోజు నుంచే అభివద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఏకైక సీఎం జగనేనని ఆయన చెప్పారు. చరిత్రలో ఎవరూ కనీవినీ ఎరుగని రీతిలో 4 లక్షల ఉద్యోగకల్ప చేశారని పేర్కొన్నారు. 
ఎన్నార్సీతో ముస్లింలకు చేటు..
ఎన్నార్సీ అమలు అయితే ముస్లింలు నష్టపోతారని జగన్‌ దష్టికి తీసుకెళ్లి వెంటనే స్పందించారని అంజాద్‌ భాష తెలిపారు. ముస్లింలను నష్టపరిచే ఎలాంటి కార్యక్రమాన్నైనా వ్యతిరేకిస్తామని జగన్‌ చెప్పారని డిప్యూటీ సీఎం అన్నారు. జగన్‌ కూడా ఎన్నార్సీని వ్యతిరేకిస్తున్నామని ప్రకటించారు. 

 

Back to Top