అజా సమయంలో సైరన్ ఇవ్వడానికి అనుమతి

రంజాన్‌ దీక్షల తరుణంలో అందరూ ఇళ్లలోనే నమాజ్‌ చేసుకోవాలి

పండ్లు, కూరగాయల దుకాణాలకు ఉదయం 10 వరకు అనుమతి 

డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా 

వైయస్‌ఆర్‌ కడప: రంజాన్‌ ఉపవాస దీక్షలలో 5 పూటలా నమాజ్‌ చేయడానికి ఇమామ్‌, మౌజన్‌లకు అనుమతిని ఇస్తున్నామని, నమాజ్‌కు సంబంధించిన అజా సమయంలో సైరన్ ఇవ్వడానికి ప్రభుత్వం అనుమతించిందని డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా పేర్కొన్నారు. పవిత్రమైన రంజాన్‌ పండుగ కరోనా వైరస్‌ సమయంలో వచ్చినందున్న.. ముస్లిం సోదరులంతా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.   గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ పాజిటివ్ కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.  రంజాన్‌ దీక్షల తరుణంలో అందరూ ఇళ్లలోనే నమాజ్‌ నిర్వహించుకోవాలని ముస్లిం సోదరులకు సూచించారు. ఇక కరోనా వ్యాప్తి పరిస్థితుల్లో ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. 

ఎవరూ బయటకు రావద్దు
సాయంత్రం ఉపవాస దీక్షలు విరమించే సమయంలో ఎవరూ బయటకు రావోద్దని, ఇళ్లలోనే ప్రత్యేక ప్రార్థనలు చేసుకొని ఇఫ్తార్‌ జరుపుకోవాలని అంజాద్‌బాషా సూచించారు.  నమాజ్‌ సమయంలో సామాజిక దూరం పాటిస్తూ కరోనా నివారణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అన్ని ప్రాంతాల్లో పండ్లు, కూరగాయల దుకాణాలు ఉదయం 10 వరకు అనుమతి ఇస్తూ అధికారులు ఆదేశాలు ఇచ్చిందన్నారు. అయితే  ఉపవాస దీక్ష విరమణ సమయంలో పండ్లు, ఫలాల కోసం సాయంత్రం వేళ దుకాణాలకు అనుమతినిచ్చినట్లు చెప్పారు. పేద ముస్లిం వాళ్లకు దాతలు చేసే ఉచిత అన్నదాన కార్యక్రమం అనుమతితో చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఇఫ్తార్‌ సమయంలో పోలీసులు అనుమతిని ఇచ్చిన కొన్ని హోటల్స్‌కు మాత్రమే టెక్‌ అవెతో వేసులు బాటు కల్పించామన్నారు. క్వారంటైన్‌లో ఉన్న ముస్లిం సోదరులకు ప్రభుత్వ యంత్రాంగం తరపున వారికి పౌష్టికాహారం అందిస్తున్నామని, అన్ని ప్రాంత్రాల్లో ప్రభుత్వ నిబంధనల బ్యానర్లను ఏర్పాటు చేయనున్నట్లు అంజాద్ బాషా తెలిపారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top