ఆహార నాణ్య‌త‌పై కాంప్ర‌మైజ్ అయ్యే ప్ర‌స‌క్తే లేదు

ప్రైవేట్ ఆస్ప‌త్రులు అధిక డ‌బ్బులు వ‌సూలు చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు

క‌ర్నూలు కోవిడ్ ఆస్ప‌త్రిలో అందుబాటులో 3,880 బెడ్లు

వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని

క‌ర్నూలు: కోవిడ్ నియంత్ర‌ణ‌కు ప్ర‌భుత్వం అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. క‌ర్నూలు జిల్లాలో మంత్రి ఆళ్ల నాని ప‌ర్య‌టించారు. కోవిడ్ నియంత్ర‌ణ చ‌ర్య‌ల‌పై అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. అనంత‌రం మంత్రి ఆళ్ల నాని మీడియాతో మాట్లాడుతూ.. క‌ర్నూలులో జిల్లాలో క‌రోనా కేసులు పెరుగుతున్న‌ది వాస్త‌వ‌మేన‌న్నారు. క‌రోనా క‌ట్ట‌డికి ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు చేప‌డుతున్నామ‌న్నారు. టెస్టుల సంఖ్య పెంచ‌డంతోనే పాజిటివ్ కేసులు ఎక్కువ‌గా నిర్ధార‌ణ అవుతున్నాయ‌న్నారు. గ‌తంలో కంటే టెస్టింగ్ ల్యాబ్ సామ‌ర్థ్యాన్ని పెంచామ‌న్నారు. లాక్‌డౌన్ ఎత్తివేయ‌డం,  కోవిడ్ ప‌రీక్ష‌లు ఎక్కువ చేయ‌డంతో కేసులు పెరుగుతున్నాయ‌ని వివ‌రించారు. క‌ర్నూలు కోవిడ్ ఆస్ప‌త్రిలో 3,880 బెడ్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. కోవిడ్ సెంట‌ర్‌ల‌లో ఆహార నాణ్య‌త‌పై కాంప్ర‌మైజ్ అయ్యే ప్ర‌స‌క్తి లేదన్నారు. ఆహారంలో కాంట్రాక్ట‌ర్లు నిర్ల‌క్ష్యం వ‌హిస్తే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని, అదేవిధంగా ప్రైవేట్ ఆస్ప‌త్రుల్లో అధిక డ‌బ్బులు వ‌సూలు చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు.

Back to Top