ఎలక్ట్రికల్‌ షార్ట్‌ సర్క్యూట్‌తోనే అగ్ని ప్రమాదం

డిప్యూటీ సీఎం ఆళ్ల నాని

విజయవాడ: ఎలక్ట్రికల్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో అనంతపురం జీజీహెచ్‌లో అగ్ని ప్రమాదం జరిగిందని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. జీజీహెచ్‌లో జరిగిన ప్రమాదంపై మంత్రి ఆళ్ల నాని స్పందించారు. అగ్ని ప్రమాదంపై ఆస్పత్రి సూపరింటెండెంట్, డీఎం అండ్‌ హెచ్‌ఓలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఎలక్ట్రికల్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం జరిగిందని, ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. రికార్డు రూమ్‌లో బుక్స్, పాత ఎక్స్‌రేలు మాత్రమే అగ్నికి ఆహుతయ్యాయని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో నిబంధనలు పాటిస్తున్నారా..? లేదా..? అని క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని ఉన్నతాధికారులను మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top