పేదల సొంతింటి కల సీఎం వైయస్‌ జగన్‌తో సాకారం

డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని

పశ్చిమగోదావరి: పేదల సొంతింటి కలను సాకారం చేయాలనే ధృడ సంకల్పంతో 31 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పంపిణీ చేశారని, పట్టాలు ఇవ్వడమే కాకుండా పేదలపై రూపాయి భారం పడకుండా ఇళ్లు కూడా కట్టిస్తున్నారని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. ఏలూరు నియోజకవర్గం చోడిమెళ్ల గ్రామంలో వైయస్‌ఆర్‌ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణానికి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల కోసం ఇంత పెద్ద మొత్తంలో ఇళ్లు కట్టిస్తున్న ప్రభుత్వం దేశంలోనే లేదన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం వైయస్‌ జగన్‌ పాలన సాగుతుందన్నారు. పేదవాడికి సెంటు స్థలం కూడా చంద్రబాబు ఇవ్వలేదని, టిడ్కో ఇళ్ల పేరుతో గత టీడీపీ ప్రభుత్వం భారీ అవకతవకలకు పాల్పడిందని ధ్వజమెత్తారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top