బలహీనవర్గాలు వైయస్‌ఆర్‌ సీపీకి వెన్నెముక

బీసీల అభివృద్ధిని కాంక్షించిన‌ ఏకైక సీఎం వైయస్‌ జగన్‌

డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత

ఏలూరు: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ వర్గాల ప్రజలకు ఈ రోజు చరిత్రలో లిఖించే రోజు అని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని అన్నారు. బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేశారన్నారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరక్టర్లకు సన్మానసభను ఏలూరు పాతబస్టాండ్‌ సమీపంలోని ఆదిత్య హోట్‌లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలోని వెనుకబడిన బలహీన వర్గాలను గుర్తించి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని అన్నారు. చంద్రబాబు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూశారని, బీసీలకు మాయ మాటలు చెప్పి వారిని అణగదొక్కారన్నారు.  

మహిళా పక్షపాతి సీఎం వైయస్‌ జగన్‌ 
మహిళలను అన్ని రంగాల్లో ముందుకు నడిపించేందుకు సీఎం వైయస్‌ జగన్‌ తోడ్పాటును అందిస్తున్నారని, నామినేటెడ్‌ పదవుల్లో సైతం 50 శాతం రిజర్వేషన్లు కల్పించి మహిళా పక్షపాతికిగా నిలిచారని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. బీసీలు అంటే బ్యాక్‌వర్డ్‌ క్లాసులు కాదని, బ్యాక్‌బోన్‌ క్లాసులు అని, బీసీలు తమ పార్టీకి వెన్నెముక అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏలూరులో జరిగిన బీసీ గర్జనలో చెప్పారని గుర్తుచేశారు. బడుగు, బలహీనవర్గాలు, మైనార్టీల అభ్యున్నతే ధ్యేయంగా సీఎం వైయస్‌ జగన్‌ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. 

Back to Top