సంక్షేమ రథసారథి వైయ‌స్‌ జగన్‌కు అడుగడుగునా నీరాజనాలు

5వ రోజు మేమంతా సిద్ధం బ‌స్సు యాత్ర‌లో కొన‌సాగుతున్న జ‌న‌జాత‌ర‌

శ్రీ‌స‌త్య‌సాయి జిల్లాలో జ‌న‌నేత‌కు దారిపొడువునా స్వాగతం పలుకుతున్న‌ ప్రజలు

శ్రీ‌స‌త్య‌సాయి జిల్లా:  పెత్తందార్లపై పోరుకు తామంతా సిద్ధమంటూ వేలాది గొంతుకలు సింహగర్జన చేస్తున్నాయి. పొత్తులు.. జిత్తులు.. మోసాలు.. కుట్రలను ఎదుర్కొని పేదల భవిష్యత్తుకు అండగా నిలిచేందుకు నేను సిద్ధం.. మీరంతా సిద్ధమా? అంటూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుఇవ్వడంతో  వేలాది మంది పిడికిళ్లు బిగించి మేమంతా సిద్ధమంటూ దిక్కులు పిక్కటిల్లేలా  నినదిస్తున్నారు.  ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా సోమ‌వారం శ్రీ‌స‌త్య‌సాయి జిల్లాలో 5వ రోజు యాత్ర‌ను సీఎం వైయ‌స్ జగ‌న్ ప్రారంభించారు.  ముఖ్యమంత్రి వైయస్‌.జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్రలో జనజాతర కొన‌సాగుతోంది. బత్తలపల్లిలో సీఎం బస్సుయాత్రలో రోడ్డుకిరువైపులా జ‌నం బారులు తీరి అపూర్వ స్వాగ‌తం ప‌లికారు. దారిపొడువునా సీఎంకు స్వాగతం ప‌లుకుతున్నారు. 

సార్వత్రిక ఎన్నికలకు ముందే వైయ‌స్ఆర్‌సీపీ సునామీ సృష్టించడం ఖాయమని వైయ‌స్ జ‌గ‌న్ ఏ ఊరు వెళ్లినా అక్క‌డ పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొంటోంది.  సీఎం వైయ‌స్ జగన్‌ నాయకత్వంపై ప్రజల్లో బలంగా నాటుకుపోయిన విశ్వాసానికి ఇది  ప్రతీకగా నిలిచింది. సార్వత్రిక ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ ‘మేమంతా సిద్ధం’ పేరుతో సీఎం వైయ‌స్ జగన్‌ చేపట్టిన బస్సు 5వ రోజు స‌త్య‌సాయి జిల్లాలో బస్సుయాత్ర జైత్రయాత్రను తలపించింది. 

Back to Top