సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన ద‌త్త పీఠం ప్ర‌తినిధులు

తాడేప‌ల్లి: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ను దత్త పీఠం ప్ర‌తినిధులు తాడేప‌ల్లి సీఎం క్యాంపు కార్యాల‌యంలో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. అవధూత దత్త పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ 80వ పుట్టినరోజు వేడుకలకు హాజ‌ర‌వ్వాల్సిందిగా ఆహ్వానప‌త్రిక‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు అంద‌జేశారు. ఆహ్వాన‌పత్రాన్ని ముఖ్యమంత్రికి అందజేసిన వారిలో దత్త పీఠం ఎగ్జిక్యూటివ్‌ ట్రస్టీ హెచ్‌.వి.ప్రసాద్, ట్రస్టీ టి.రమేష్, టీటీడీ చైర్మన్‌ వైవీ.సుబ్బారెడ్డి ఉన్నారు. 

Back to Top