వైయస్‌ జగన్‌తో దగ్గుబాటి వెంకటేశ్వరరావు భేటీ..

వైయస్‌ జగన్‌ కష్టాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు...

డ్వాక్రా మహిళలకు పోస్టు డేటెడ్‌ చెక్‌లు ఇవ్వడం విచిత్రం

ప్రభుత్వ డబ్బులతో చంద్రబాబు దొంగ దీక్షలు

 

హైదరాబాద్‌:ఏపీ ప్రభుత్వ పనితీరు గాడి తప్పిందని దగ్గుబాటి వెంకటేశ్వరరావు అన్నారు.వైయస్‌ జగన్‌తో భేటీ అయ్యారు. దగ్గుబాటి వెంట ఆయన కుమారుడు హితేజ్‌ ఉన్నారు. ఈ సందర్భంగా మీడియాతో దగ్గుబాటి మాట్లాడారు. వైయస్‌ఆర్‌సీపీలోకి వెళ్లడానికి నిర్ణయం తీసుకున్నామని, తమ నిర్ణయాన్ని వైయస్‌ జగన్‌ స్వాగతించారని తెలిపారు.  కుమారుడు హితేజ్‌ వైయస్‌ జగన్‌తో కలిసి పనిచేస్తారన్నారు. పార్టీ ఆదేశాల మేరకు నడుచుకుంటామని తెలిపారు. ప్రభుత్వ డబ్బులతో చంద్రబాబు దొంగ దీక్షలు చేస్తున్నారని విమర్శించారు. కోట్లు ఖర్చుచేసి జనాన్ని తరలిస్తున్నారన్నారన్నారు. డ్వాక్రా మహిళలకు పోస్టు డేటెడ్‌ చెక్‌లు ఇవ్వడం విచిత్రమన్నారు.పోస్ట్‌ డేటెడ్‌ చెక్కులతో రుణమాఫీనా అంటూ ప్రశ్నించారు. నా రాజకీయ చరిత్రలో ఇలాంటి విడ్డూరం ఇంతవరుకు చూడలేదన్నారు. రైతులకు నాలుగు,ఐదో విడత రుణమాఫీ చేయలేదన్నారు. భేటీలో వైయస్‌ఆర్‌సీపీ నేతలు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, కృష్ణదేవరాయలు తదితరులు పాల్గొన్నారు. ఎన్నో ఏళ్లుగా శ్రమించి వైయస్‌ జగన్‌పార్టీని నడుపుతున్నారన్నారు.వైయస్‌ జగన్‌ కష్టాన్ని ప్రజలు గుర్తిస్తున్నారన్నారు.

Back to Top