రాష్ట్రంలోని ర‌హ‌దారుల‌న్నీ అభివృద్ధి చేస్తాం

ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రిగా దాడిశెట్టి రాజా బాధ్యతల స్వీకరణ

సచివాలయం: రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా దాడిశెట్టి రాజా బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని తన చాంబర్‌లో ప్రత్యేక పూజలు చేసి తన శాఖ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో రూ. 3 వేల కోట్లు రహదారుల కోసం అప్పు చేసి ఎన్నికల కోసం ఖర్చు చేశారని దుయ్యబట్టారు. గతంలో చంద్రబాబు చేసిన అప్పులను వైయస్‌ జగన్‌ ప్రభుత్వం తీర్చుతుందని, అప్పులు తీర్చడంతో పాటు రహదారులను కూడా నిర్మిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని రహదారులన్నీ అభివృద్ధి చేస్తామని మంత్రి దాడిశెట్టి రాజా చెప్పారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top