పవన్‌ కళ్యాణ్‌ వి జోకర్, బ్రోకర్‌ చేష్టలు

రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా  

 కాపులను చీల్చడమే చంద్రబాబు పవన్‌ కళ్యాణ్‌కి ఇచ్చిన టాస్క్‌

 బాబు-పవన్ కుట్రలు ఏ మాత్రం ఫలించవు...కాపులంతా  వైయ‌స్ఆర్‌సీపీ వైపే

 వైయ‌స్  జగన్‌ గారిని ఎదుర్కోలేనని రణస్థలం సాక్షిగా పవన్ ఒప్పుకున్నాడు

 చంద్రబాబును పైకి లేపడానికి లెఫ్ట్, రైట్‌ లను ఏకం చేయాలనుకుంటున్నారు

 తానే దత్తపుత్రుడినని ఒప్పుకుంటాడు... మళ్లీ ఆ మాట అనొద్దంటాడు

తాడేపల్లి:  పవన్ చేసే జోకర్ చేష్టలు, బ్రోకర్ చేష్టలన్నీ చూసి కాపులంతా అసహ్యించుకుంటున్నార‌ని మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. ఎప్పుడో చచ్చిపోయిన చంద్రబాబు పార్టీని బతికించటానికి పవన్ కల్యాణ్‌ తెగ ఆరాటపడుతున్నాడని విమర్శించారు. బలమైన కాపు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ కూడా పవన్ దూషణలకు దిగాడని మండిపడ్డారు. తమ నాయకుడు చంద్రబాబు చెప్పాడని ఇలాంటి వ్యాఖ్యలు చేశారని దుయ్యబట్టారు. మంత్రి అంబటి రాంబాబు కాపులకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించే నేత అని, అలాంటి వ్యక్తిని కూడా దూషించడం సరికాదన్నారు.   తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. 
 

కాపు సామాజికవర్గ నేతల్ని టార్గెట్ చేస్తున్న పవన్:

  • -రాజకీయంగా చచ్చిపోయిన చంద్రబాబునాయుడిని బతికించడానికి పవన్‌ కళ్యాణ్‌ యువశక్తి సభ పెట్టినట్లుంది. పవన్‌ కళ్యాణ్‌ తాపత్రయం అంతా చంద్రబాబును, ఆయన పార్టీని బతికించడం కోసమే.
  • -తనకు భయం లేదని చెప్పుకోవడం కోసం, తన యజమాని చంద్రబాబు అప్పజెప్పిన టాస్క్‌  పూర్తి చేయాలనే ఆ సభ పెట్టాడు
  • -పదే పదే కాపు సామాజిక వర్గాన్ని టార్గెట్‌ చేస్తూ... ఆ నాయకులను నోటికొచ్చినట్లు పవన్ దుర్భాషలాడుతున్నాడు
  • -పదేళ్ల వయసులోనే తండ్రి చనిపోతే, ఎన్నో కష్టాలు పడిన గుడివాడ అమర్నాథ్‌ ఈ రోజు మంత్రిగా సమర్ధవంతంగా పనిచేస్తున్నాడు. కాపు సామాజిక వర్గం ఎప్పుడు ఇబ్బందుల్లో ఉన్నా నేనున్నాను అని భుజం కాసే అంబటి రాంబాబును నానా రకాలుగా దుర్భాషలాడాడు . కేవలం కాపు సామాజికవర్గ నేతలే టార్గెట్‌...మీరంతా నా దగ్గరకి రండి మీ పీక పిసికేస్తాను అంటాడు
  • -మేం మొదటి నుంచీ చంద్రబాబు, పవన్‌ ఒకటే అని చెప్తూనే ఉన్నాం
  • -అందుకనే కదా మేం ఆయన్ని దత్తపుత్రుడు అనేది. 

పవన్‌ కళ్యాణ్‌ వి జోకర్, బ్రోకర్‌ చేష్టలు

  • -ఒకటైతే క్లియర్‌గా చెప్పాడు.. అంతమంది సాక్షిగా జగన్‌ గారిని నేను ఎదుర్కొనలేను అని చెప్పాడు.
  • -పవన్‌ కళ్యాణ్, చంద్రబాబు సహా ఈ రాష్ట్రంలో ఉన్న మిగతా పార్టీలు కలిసి వచ్చినా జగన్‌ గారిని ఎదుర్కోలేరు...ఇది సత్యం
  • -రాష్ట్రంలో చిత్రమైన రాజకీయం జరుగుతోంది...చంద్రబాబును జాకీలతో పైకి లేపడానికి లెఫ్ట్, రైట్‌ అందర్నీ కలుపాలనుకుంటున్నాడు
  • -అది నీవల్ల కాదు పవన్‌ కళ్యాణ్‌...నువ్వు చేసే జోకర్, బ్రోకర్‌ చేష్టలను అందరూ గమనించారు.
  • -మహానుభావుల పేర్లు చెప్పి, వాళ్లతో పవన్‌ తనను తాను పోల్చుకుంటున్నాడు...అసలు వారికి ఆయనకు ఏమైనా సంబంధం ఉందా..?
  • -పవన్‌ కళ్యాణ్‌ని నమ్మి వచ్చిన వారిని పోలీసుల మీద, ఈ వ్యవస్థ మీద తిరగబడండి అని రెచ్చగొడుతున్నాడు
  • -రేపు వాళ్లు ఏదైనా జరగకూడనివి చేసి కేసుల్లో ఇరుక్కుంటే.. చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ వచ్చి కాపాడతారా అనేది సమాధానం చెప్పాలి
  • -పవన్‌ మద్దతుతో నడిచిన చంద్రబాబు ప్రభుత్వంలో ఎంత మంది కాపుల మీద కేసులు పెట్టి వేధించారో గణాంకాలు చూడండి
  • -అత్యధిక సంఖ్యలో కాపులు బాధితులు అయ్యారు...దాన్ని కాపులెవ్వరూ మర్చిపోలేదు

అభివృద్ధి సూచీలో దేశంలోనే నంబర్‌ 1 ఆంధ్రప్రదేశ్‌ః

  • -సంక్షేమాన్ని తక్కువ చేసి చెప్పడానికి పవన్ కల్యాణ్ చేసిన ప్రయత్నంలో,  ప్రజాసేవను తక్కువ చేసి మాట్లాడుతున్నాడు
  • -ఆ మాటలు విని ఈ రాష్ట్రంలోని మహిళలంతా పవన్‌ కళ్యాణ్‌పై మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
  • -మీ మద్దతుతో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ సంక్షేమం ఎందుకు చేయలేకపోయారు..?
  • -2014–19వరకూ సరాసరి రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఏటా రూ.11 వేల కోట్లు
  • -వైఎస్‌ జగన్‌ గారు అధికారం చేపట్టిన తర్వాత, కరోనా కష్టకాలం ఉన్నా సరాసరి ఏటా రూ.15 వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి
  • -అభివృద్ధి సూచీలో దేశంలోనే నంబర్‌ 1 రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌
  • -పెట్టుబడిదారులను ఆకర్షించే దిశగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌గారిదే
  • -ఇవన్నీ చూడకుండా యజమాని ఇచ్చిన స్క్రిప్ట్‌ ప్రకారం పవన్‌ వాగేసి వెళ్లిపోతున్నాడు

అల్లర్లు సృష్టించాలని మీరిద్దరూ మాట్లాడుకున్నారా..?

  • -పవన్‌కళ్యాణ్, చంద్రబాబులు ప్యాకేజీ కోసం మాట్లాడుకుని ఉంటారు.
  • -లేదంటే రాష్ట్రంలో నీ అభిమానులను రెచ్చగొట్టి అల్లర్లు సృష్టించాలని స్కెచ్‌ వేసి ఉంటారు
  • -భీమ్లానాయక్‌ వల్ల రూ. 30 కోట్లు నష్టపోయాను అని పవన్‌ కళ్యాణ్‌ అంటున్నాడు...
  • -ఆయన తీసిన సినిమా నాసిరకం అయ్యి ప్రజలు చూడకపోతే మేమేం చేస్తాం
  • -ఆ సినిమా పెట్టుబడి కనీసం రూ.20 కోట్లు కూడా చేయదు..రూ.30 కోట్లు పోయిందంటాడు
  • -కాంతారా సినిమా తక్కువ పెట్టుబడి పెట్టినా మంచి హిట్‌గా నిలిచింది
  • -ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నిటితో పొత్తు పెట్టుకోండి.. మాకు భయం లేదు
  • -మేం ఒంటరిగానే వస్తాం...మిమ్మల్ని ఎదుర్కొంటాం..గతంలో కంటే అత్యధిక స్థానాల్లో గెలిచి 2024లో ప్రభుత్వాన్ని స్థాపిస్తాం

బాబు-పవన్‌ కళ్యాణ్‌ కుట్రలు ఫలించవుః

  • -ఈ రాష్ట్రంలో ఒక బలమైన సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం. అదేవిధంగా  బీసీ,ఎస్సీ,ఎస్టీల ప్రాతినిధ్యం మా పార్టీలో గననీయంగా ఉంది
  • -ఇంతటి సామాజిక న్యాయం రాష్ట్రంలో ఇప్పటి వరకూ ఎప్పుడూ జరగలేదు
  • -నీ యజమాని కోసం, నీ ప్యాకేజీ కోసం నువ్వు  పనిచేస్తున్నావు కానీ...మీ కలలు నెరవేరే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు
  • -ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ గారి పరిపాలనలో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంది
  • -గతంలో రాష్ట్రాన్ని తండ్రీ కొడుకులు చంద్రబాబు, లోకేష్ లు దోచుకుతింటే... అదంతా సరిదిద్ది, ఈ రాష్ట్రాన్ని జగన్‌ గారు అత్యంత సమర్ధతతో నడిపిస్తున్నారు
  • -ఆయన చేతిలో కాకుండా వేరే వారి చేతిలో పడి ఉంటే ఈ రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో పడేది
  • -నువ్వు, నీ యజమాని కుట్రలు ఈ రాష్ట్రంలో నెరవేరే పరిస్థితి లేనే లేదు
  • -మహిళలను, కాపు సామాజికవర్గ నేతలపై నీ భాషను అదుపులో పెట్టుకుని ఉంటే బాగుంటుంది.

తానే దత్తపుత్రుడినని ఒప్పుకున్నాడు...మళ్లీ ఆ మాట అనొద్దంటాడుః

  • -తనని దత్తపుత్రుడు అనొద్దని బాధపుడుతున్నాడు...కానీ నిన్న స్టేజ్‌పై తానే దత్తపుత్రుడిని అని తనంతట తానే చెప్పుకుంటున్నాడు
  • -ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌లు కుల రిజర్వేషన్‌ కాదు...అవి ఆర్థికపరమైన రిజర్వేషన్‌లు
  • -కులం ఆ రిజర్వేషన్‌కు ప్రాతిపదిక కాదన్నప్పుడు ఒక కమ్యూనిటీకి అందులో షేర్‌ ఎలా ఇస్తాం..?
  • -కేంద్ర ప్రభుత్వం ఒక కులానికి ఇవ్వమని అనుమతి ఇస్తే తప్పకుండా చేయడానికి ముఖ్యమంత్రిగారు ఎప్పుడూ ముందుంటారు
  • -కానీ ఆర్ధికపరమైన బలహీనవర్గాలకు ఇచ్చిన రిజర్వేషన్‌లో వెసులుబాటు లేదు
  • -ఈబీసీల్లోనూ అత్యధికంగా కాపులే ఉంటారు...ఇచ్చిన పదిశాతంలో దాదాపు 7 శాతం కాపులే ఉంటారు
  • -మళ్లీ 5 శాతానికి దిగిపోవడం అంటే కాపులకు నష్టమే కదా..
  • -చంద్రబాబు ఆనాడు పెట్టిన రిజర్వేషన్ల ప్రతిపాదనను.. కనీసం కేంద్రానికి కూడా పంపలేదు

వైఎస్సార్‌ గారి గురించి మాట్లాడే క్యారెక్టర్‌ పవన్‌కి లేదుః

  • -రాజశేఖరరెడ్డి గారి పేరెత్తే అర్హత, క్యారెక్టర్‌ పవన్‌ కళ్యాణ్‌కి లేదు
  • -ప్రజల మనసుల్లో దేవుడిగా స్థానం సంపాదించిన నాయకుడు మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారు.
  • -రాజశేఖరరెడ్డి గారి దెబ్బకే కదా మీ పార్టీ ఆనాడు కనుమరుగైంది...

కాపులను దూరం చేయాలన్నదే పవన్ కు అప్పగించిన టాస్క్ః

  • -ఈ రోజు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని ఎదుర్కోవడం ఈ రాష్ట్రంలో ఏ పార్టీ వల్ల కాదు
  • -జగన్‌ గారి సంక్షేమ, అభివృద్ధి పాలనను ప్రజల ముందు పెట్టారు...ప్రజలు మార్కులు వేస్తారు
  • -ఎల్లో మీడియా, చంద్రబాబు, దత్తపుత్రుడు కాదు మార్కులు వేసేది..
  • -కాపులను వైఎస్సార్సీపీకి దూరం చేయాలనేదే పవన్‌కు అతని యజమాని చంద్రబాబు అప్పజెప్పిన టాస్క్‌
  • -పవన్‌ ఆ ప్రయత్నం చేస్తున్నాడు...కానీ అది జరిగే పనికాదు
  • -పేద ప్రజల అభివృద్ధి కోసం ఇంత బాగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలో ఇంకెవ్వరూ లేరు
Back to Top