పంటల బీమా పథకం పేరు మార్పు

‘వైయస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా’గా నామకరణం

అమరావతి: రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పంటల బీమా పథకానికి దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పేరు మీద ‘వైయస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా పథకంగా నామకరణం చేశారు. మహానేత వైయస్‌ఆర్‌ రైతులకు చేసిన సేవలకు గాను పంటల బీమా పథకానికి వైయస్‌ఆర్‌ పేరు పెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, 2019–20 రబీ సీజన్, 2020 ఖరీఫ్‌ పంటకు పంటల బీమా పథకం వర్తింపజేసేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏపీ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ద్వారా ఉచిత పంటల బీమా పథకం రైతులకు అందుతుంది.  

రైతు కేవలం ఒక్క రూపాయి కడితే చాలు పంట ఇన్సూరెన్స్‌ ప్రీమియం పూర్తిగా ప్రభుత్వమే భరిస్తోంది. 2019 ఖరీఫ్‌కు సంబంధించి ఇన్సూరెన్స్‌ కోసం రైతు ఒక్క రూపాయి చెల్లించగా.. రైతులందరి తరఫున రూ.506 కోట్ల ప్రీమియంతో పాటు, ప్రభుత్వం వాటాగా మరో రూ.524 కోట్లను వైయస్‌ జగన్‌ సర్కార్‌ చెల్లించింది. మొత్తంగా రూ.1030 కోట్లు రైతులకు ఇన్సూరెన్స్‌ ప్రీమియంగా చెల్లించి ఉచితంగా పంట బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తోంది. 
 

Back to Top