సీపీఎస్ పై చంద్ర‌బాబు ద‌గా

 

కంట్రిబ్యూట‌రీ పెన్ష‌న్ స్కీమ్ రాష్ట్రంలో లక్ష‌లాది ఉద్యోగుల‌పాలిట శాపంగా మారింది. దీన్ని ర‌ద్దు చేయాలంటూ ఏపీ ప్ర‌భుత్వోద్యోగులు ఛ‌లో అసెంబ్లీ అంటూ ముట్ట‌డి కూడా జ‌రిపారు. దీక్ష‌లు లేచి త‌మ నిర‌స‌న‌లు తెలిపారు. దీనిపై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చెప్పిన మాట *సిపిఎస్ ర‌ద్దు అనేది కేంద్ర  ప‌రిధిలోని అంశం. దీనిపై కేంద్రానికి విన‌త చేయ‌డం త‌ప్ప ఏమీ చేయ‌లేము *. 

నేడు ఇదే చంద్ర‌బాబు ఎన్నిక‌ల జిమ్మిక్కుల్లో భాగంగా సీపీఎస్ ర‌ద్దు అంటూ ప్ర‌చారం మొద‌లు పెట్టాడు. తీరా వివ‌రాలు చూస్తే సీపీఎస్ ర‌ద్దు కోసం కేంద్రానికి లేఖ రాస్తామ‌న్న‌ది చంద్ర‌బాబు హామీలోని అస‌లు సారాంశ‌మ‌ట‌. అంటే కాపు రిజ్వ‌ర్వేష‌న్ అంశంలాగే సీపీఎస్ అంశాన్ని కూడా కేంద్రానికి పంపి చేతులు దులుపుకోవ‌డ‌మే బాబు ఎన్నిక‌ల స్టంటు. 

పీఎఫ్ఆర్డీఏ, ఎన్‌డీఎల్, సీఆర్ఏ అనే మూడు సంస్థ‌ల అధీనంలో సీపీఎస్ అమ‌లౌతోంది. ప్రైవేట్ కార్పొరేట్ల ఆధీనంలో న‌డిచే ఈ సంస్థ‌ల‌పై కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాల అజ‌మాయిషీ లేదు. వీటి ఖ‌ర్చులు కూడా ఉద్యోగుల ఖాతాల నుంచే వినియోగిస్తారు. సీపీఎస్ ర‌ద్దు కోసం ఉద్యోగులు చేస్తున్న పోరాటాన్ని నీరుగారుస్తున్న‌ది ఆ ఉద్యోగ సంఘాల నేత‌లే అని ఆరోప‌ణ‌లున్నాయి. ప్ర‌భుత్వానికి అనూకూలంగా ప‌నిచేస్తూ ఉద్య‌మాన్ని నీరుగారుస్తున్నార‌ని ఉద్యోగులు మండిప‌డుతున్నారు. అలా ప్ర‌భుత్వ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌కు ఉద్యోగుల సంక్షేమాన్ని ప‌ణంగా పెట్టిన నేత‌లు నేడు ఆ పార్టీ స‌భ్యులై ప‌దువులు, సీట్లు పొందుతున్నార‌ని విమ‌ర్శ‌లున్నాయి. ఇత‌ర రాష్ట్రాల్లో సీపీఎస్ ర‌ద్దు కోరుతూ ఉద్యోగులు స‌మ్మె బాట ప‌ట్టారు. కానీ ఏపీలో మాత్రం ప్ర‌భుత్వాల‌తో చేతులు క‌లిపిన ఉద్యోగ సంఘాల నేత‌లు సీపీఎస్ ర‌ద్దు విష‌యాన్ని నీరు కారుస్తున్నారు. 

గ‌తంలో ఉన్న పెన్ష‌న్ విధానానికీ నేడు అమల్లో ఉన్న సీపీఎస్ కు చాలా తేడా ఉంది. 

పాత పెన్షన్‌ విధానంతో కలిగే లాభాలు

ప్రభుత్వ హామి ఉంటుంది. 

సంవత్సరానికి రెండు డీఏలు, ఐదేళ్లకు ఒకసారి పీఆర్సీతో పెన్షన్‌ మొత్తం పెంపు

పదవీ విరమణ తర్వాత హెల్త్‌కార్డులు

ఉద్యోగులు పెన్షన్‌ నిర్వహణ చార్జీలు చెల్లించే అవసరం లేదు.

పెన్షన్‌కు ప్రతినెలా చందా చెల్లించాల్సిన అవసరం లేదు.

ఉద్యోగి మరణించేంతవరకు ప్రభుత్వం తోడుగా ఉంటుంది.

గ్రాట్యూటీ, కుటుంబ పెన్షన్‌ వర్తిస్తుంది.

జీవితాంతం పెన్షన్‌ మొత్తానికి ఢోకా ఉండదు 

 

సీపీఎస్‌తో కలిగే నష్టాలు

షేర్‌ మార్కెట్‌ ఆధారిత పెన్షన్‌ కావడంతో ప్రభుత్వ హామి ఉండదు. 

ఎంచుకున్న ఆన్‌డ్యూటీ ఫ్లాన్‌ ఆధారంగా పెన్షన్‌మొత్తం పెరగవచ్చు, తగ్గవచ్చు.

ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ప్రాన్‌ఖాతాలో నిర్వహణ చార్జీలు చెల్లించాలి.

ప్రతినెలా మూలవేతనంతోపాటు డీఏలో 10 శాతం చందా చెల్లించాలి.

ఉద్యోగులు పదవీవిరమణ చేసేంతవరకు 10 శాతం మాచింగ్‌ గ్రాంట్‌ రూపంలో ప్రభుత్వం ఇస్తుంది.

పదవీవిరమణ తరువాత ఎలాంటి తోడ్పాటు ఉండదు.

కుటుంబ పెన్షన్‌ ఇవ్వాల్సి వస్తే ప్రాన్‌ ఖాతాలో మొత్తం సొమ్ము ప్రభుత్వానికి  చెల్లించాల్సి ఉంటుంది. 

2018 తెలంగాణా ఎన్నిక‌ల్లో కూట‌మి క‌ట్టి వెళ్లిన తెలుగుదేశం టి.ప్ర‌భుత్వోద్యోగుల ఓట్ల కోసం సీపీఎస్ ర‌ద్దు హామీ ఇచ్చింది. ఏపీలో మాత్రం అది కేంద్ర చొర‌వ చూపాల్సిందే త‌ప్ప రాష్ట్రం చేసేదేం లేద‌ని ఐదేళ్లుగా నాన్చుతూ వ‌చ్చింది. మ‌ళ్లీ ఎన్నిక‌లు స‌మీపించ‌గానే ర‌ద్దు అంశాన్ని తెర‌పైకి తెచ్చి ఉద్యోగుల ఓట్ల‌కు గాలం వేయాల‌నుకుంటోంది. చంద్ర‌బాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా ఉద్యోగుల‌ను హింసించ‌డ‌మే త‌ప్ప వారి సంక్షేమాన్ని సమ‌స్య‌ల‌ను ప‌ట్టించుకోడ‌న్న సంగ‌తి మ‌రోసారి రుజువైంది. 

Back to Top