కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో ఏపీ స‌రికొత్త రికార్డ్‌..

  సాయంత్రం 6 గంటలకు 12 లక్షల మందికిపైగా వ్యాక్సినేషన్‌

అమ‌రావ‌తి:   ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నేతృత్వంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం మ‌రో స‌రికొత్త రికార్డును నెల‌కొల్పింది.   ఒక్క రోజులో దాదాపు 12 లక్షల మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేసింది. దేశవ్యాప్తంగా చేపట్టిన కొవిడ్ వ్యాక్సినేషన్ లో ఆంధ్రప్రదేశ్ నయా రికార్డ్ లిఖించింది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కొద్ది వారాలుగా విస్తృతంగా చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పెంచింది. రాష్ట్రంలో మెగా వ్యాక్సిన్‌ డ్రైవ్‌ కొనసాగుతోంది. ఈ వ్యాక్సిన్‌ డ్రైవ్‌కు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో  సాయంత్రం 6 గంటలకు 12 లక్షల మందికిపైగా వైద్య ఆరోగ్యశాఖ వ్యాక్సినేషన్‌ వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,232 కేంద్రాల్లో డ్రైవ్‌ నడుస్తోంది.

45ఏళ్లు పైబడిన వారు, ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు వ్యాక్సినేషన్‌ జరుగుతోంది. తూ.గో. జిల్లాలో అత్యధికంగా 1.50 లక్షల మందికిపైగా వ్యాక్సిన్ వేశారు. 
కాగా, కరోనా విజృంభించిన వేళ ఆక్సిజన్‌ నిల్వలను, ఆసుపత్రుల్లో బెడ్స్‌ను పెంచటంపై దృష్టి పెట్టిన ప్రభుత్వం... ఇపుడు కేసులు తగ్గుతుండటంతో ఒకవైపు కట్టడి చేస్తూనే వ్యాక్సినేషన్‌పై దృష్టిపెట్టింది. వ్యాక్సిన్ల లభ్యతను బట్టి ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తోంది.

ఇదే క్రమంలో ఆదివారం ఒకేరోజు ఏకంగా 8 లక్షల మందికి టీకాలు వేయాలని సంకల్పించి... అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు పూర్తిచేసింది.  కాగా, ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకే లక్ష్యాన్ని సాధించి రికార్డు నెలకొల్పింది. మరోవంక గ్రామాల్లో ఫీవర్‌ సర్వేను నిరంతరం కొనసాగిస్తూ... లక్షణాలున్న వారిని గుర్తించి, పరీక్షించి ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా చికిత్స చేసే (టీటీటీ) వ్యవస్థను కూడా పకడ్బందీగా కొనసాగిస్తోంది.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top