ఏపీలో వేగంగా పుంజుకుంటున్న కరోనా పరీక్షలు

24 గంటల్లో 10,292 మందికి పరీక్షలు

67 కొత్త కేసులు

తగ్గుతున్న పాజిటివ్‌ కేసుల సంఖ్య

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా పరీక్షలు వేగంగా పుంజుకుంటున్నాయి.  గడిచిన 24 గంటల్లో  రాష్ట్రంలో 10,292 మందికి పరీక్షలు నిర్వహించగా 67 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.  ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,25,229 మందికి పరీక్షలు నిర్వహించారు. ప్రతి పది లక్షల జనాభాకు 2,345 మందికి పరీక్షలు చేశారు. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 1.28 శాతం కాగా, 1.9 శాతం మరణాలు నమోదు అయ్యాయి.  దేశంలో 3.84 శాతం పాజిటివ్‌ కేసులు, 3.27 శాతం మరణాలు నమోదు అయ్యాయి. రాష్ట్రం లోని నమోదైన మొత్తం 1717 పాజిటివ్ కేసు లకు గాను 589 మంది డిశ్చార్జ్ కాగా, 34 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1094" అని ఆరోగ్యాంధ్ర ట్విట్టర్ ఖాతాలో అధికారులు పేర్కొన్నారు.
అనంతపురం జిల్లాలో 2, గుంటూరు జిల్లాలో 13, కడప జిల్లాలో 2, కృష్ణా జిల్లాలో 8, కర్నూలు జిల్లాలో 25, నెల్లూరు జిల్లాలో 1, విశాఖపట్నం జిల్లాలో 2 కేసులతో పాటు రాష్ట్రంలో చిక్కుబడివున్న గుజరాత్ వాసుల్లో 14 మందికి పాజిటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు. 

Back to Top