ఏపీలో లాక్‌డౌన్ సడలింపు

 కొత్త గైడ్‌లైన్స్‌ విడుదల చేసిన సర్కార్‌
 

 
 
తాడేపల్లి : కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం లాక్‌డౌన్ సడలింపునకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం‌ అదనపు గైడ్‌లైన్స్‌‌ను విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన సూచనల మేరకు బుధవారం ఈ కొత్త మార్గదర్శకాలను వెల్లడించింది. .

కొత్త గైడ్‌లైన్స్‌ ప్రకారం : 
►వ్యవసాయ రంగం, హార్టికల్చర్ పనులకు మినహాయింపు 
►ప్లాంటేషన్ పనులు, కోత, ప్రాసెసింగ్, ప్యాకింగ్, మార్కెటింగ్‌కు మినహాయింపు 
►ఆర్థిక రంగానికి మినహాయింపు
►గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులతో పాటు పవర్ లైన్స్, టెలికాం కేబుల్స్ పనులకు అనుమతి 
►కావాల్సిన అనుమతులతో ఈ కామర్స్ కంపెనీలకు, వారు వాడే వాహనాలకు అనుమతి 
►వలస కార్మికులకు రాష్ట్రం పరిధిలో వారి సొంత ప్రాంతాలకు వెళ్లి పని చేసుకునేందుకు అనుమతి
►కరోనా లక్షణాలు లేని వారికి మాత్రమే మినహాయింపు
►వలస కార్మికులు లాక్‌డౌన్‌ సమయంలో ఏ రాష్ట్రంలో ఉంటే అదే రాష్ట్రంలో మాత్రమే పనులకు అనుమతి 
►బుక్స్ షాపు, ఎలక్ట్రిక్ ఫ్యాన్స్ షాపులకు మినహాయింపు
►ఓడలకు ప్రత్యేక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏర్పాటు
►మాల్స్ తప్ప గ్రామీణ ప్రాంతంలో ఉండే షాపులు, మార్కెట్ కాంప్లెక్స్‌లకు అనుమతి

Back to Top