సీఎం సహాయనిధికి ‘కోరమాండల్‌’ రూ.2 కోట్ల విరాళం

తాడేపల్లి: కోవిడ్‌ –19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ రూ.2 కోట్లు విరాళం అందించింది. ఈమేరకు తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సమీర్‌ గోయెల్, వైస్‌ ప్రెసిడెంట్‌ (కార్పొరేట్‌ రిలేషన్స్‌) కె సత్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిసి విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఉన్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top