టీటీడీ నమూనా ఆలయ నిర్మాణ పనులను ప‌రిశీలించిన వైవీ సుబ్బారెడ్డి 

తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణాన్ని టీటీడీ అధ్యక్షులు వైవీ సుబ్బారెడ్డి  పరిశీలించారు. తుళ్లూరు మండలం వెంకటాపాలెంలో నిర్మిస్తున్న ఆలయం పునాది నిర్మాణ పనుల గురించి అక్కడ ఇంజనీరింగ్‌ అధికారులతో చర్చించారు. రూ.150 కోట్ల అంచనా వ్యయంతో జనవరిలో స్వామి వారి ఆలయానికి శంకుస్థాపన జరిగింది. అప్పటి నుంచి కొనసాగుతున్న పనుల గురించి సుబ్బారెడ్డి   ఆరా తీశారు. ఉపరితలమంతా రాతి కట్టడం కావడంతో మూడు ప్రాంతాల్లో ఆకృతులకు సంబంధించి పనులు జరుగుతున్నట్లు టీటీడీ ఛీఫ్‌ ఇంజనీర్‌ చంద్రశేఖర్‌రెడ్డి వివరించారు. ఈ సందర్బంగా సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇప్పటివరకు ఆలయ పునాదుల కు సంబంధించి ఎర్త్ వర్క్ జరుగుతున్నట్లు తెలిపారు. రాజధాని ప్రాంత ప్రజలు శ్రీవేంకటేశ్వర స్వామిని సేవించుకునేందుకు టీటీడీ కృషి చేస్తుందని తెలిపారు. 

Back to Top