వైయస్‌ షర్మిలపై దుష్ప్రచారాల డొంక కదులుతోంది

రాజకీయంగా ఎదుర్కోలేక దుష్ప్రచారాలు

తెలుగుదేశం పార్టీ డైరెక్షన్‌లో జరుగుతున్నట్లుగా తేలింది

అభిమానించే కుటుంబాలను పావులుగా వాడుకుంటున్న చంద్రబాబు

మాకేం సంబంధం లేదన్న బాబు ఇప్పడే సమాధానం చెబుతారు

వైయస్‌ షర్మిలపై జరిగిన విష్ప్రచారాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలి

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ

హైదరబాద్ : ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక వారి కుటుంబ సభ్యుల వ్యక్తిత్వాలను దిగజార్చేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. వైయస్‌ జగన్‌ సోదరి వైయస్‌ షర్మిలపై సోషల్‌ మీడియాలో ఐదేళ్లుగా జరుగుతున్న దుష్ప్రచారాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్‌ సీపీకి ఇచ్చిన ఫిర్యాదుతో విషప్రచారం వెనుక తెలుగుదేశం పార్టీ కుట్ర ఉందని భయటపడుతుందన్నారు. లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో వాసిరెడ్డి పద్మ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సంబంధం లేని విషయాన్ని అంటగట్టి ఐదేళ్లుగా వైయస్‌ షర్మిలపై విస్తృతంగా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మహిళలను కించపరిచే విధంగా అసభ్య ప్రచారాలు చేసే విష సంస్కృతికి టీడీపీ ఆజ్యం పోస్తుందని ధ్వజమెత్తారు.  

మాకేం సంబంధం లేదని మాట్లాడిన చంద్రబాబు అరెస్టులకు ఏం సమాధానం చెబుతారని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన వారిని ఉపయోగించి సోషల్‌ మీడియాల్లో అసభ్యకర కామెంట్లు పెట్టిస్తున్నారని తేలిందన్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లల కెరీర్‌కు దెబ్బతగులుతుందనే ఆలోచన లేకుండా, ఆ కుటుంబాలు ఏమవుతాయనే ఇంకింతం లేకుండా విద్యార్థులను చంద్రబాబు సమిధలుగా వాడుకుంటున్నాడన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం అభిమానించే కుటుంబాల విద్యార్థులను ఉపయోగించుకొని వారి భవిష్యత్తును చంద్రబాబు అంధకారంలోకి నెట్టేస్తున్నారన్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లు అనే విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారని,  వైయస్‌ షర్మిల ఇచ్చిన ఫిర్యాదుపై ఇంకా అనేక మంది అరెస్టు కావాల్సి ఉందన్నారు. వెంకటేశ్వర్లు తండ్రి మంత్రి సిద్ధిరాఘవులు ముఖ్య అనుచరుడని, రెండెకరాల ప్రభుత్వ భూమి ఆ కుటుంబానికి ఇచ్చినట్లుగా తేలిందన్నారు. మరికొన్ని అరెస్టులు జరిగితే టీడీపీ డైరెక్షన్, స్క్రీన్‌ ప్లే మొత్తం అర్థం అవుతుందన్నారు. 

Back to Top