కాంగ్రెస్‌ గో బ్యాక్‌

కాంగ్రెస్‌ బస్సు యాత్రను అడ్డుకున్న వైయస్‌ఆర్‌సీపీ 
 

నెల్లూరు: నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్‌ బస్సు యాత్రను వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్, వైయస్‌ఆర్‌సీపీ శ్రేణుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. కాంగ్రెస్‌ గో బ్యాక్‌ అంటూ వైయస్‌ఆర్‌సీపీ నేతలు నల్లజెండాలతో నిరసన తెలిపారు. రాష్ట్ర విభజనకు కారణమైన పార్టీ మళ్లీ ఏ మొహం పెట్టుకొని ఏపీ రాష్ట్ర ప్రజల వద్దకు వచ్చారని పార్టీ శ్రేణులు మండిపడ్డారు. విభజన సమయంలో ఏపీకి కచ్చితమైన హామీ ఇవ్వకుండా..చూస్తాం..చేస్తామని చెప్పడంతో ఇవాళ అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
 

Back to Top