ముగిసిన వైయ‌స్ఆర్‌సీపీ ప్లీనరీ సమావేశాలు

అంచ‌నాల‌కు మించి హాజ‌రైన పార్టీ శ్రేణులు

కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌లో జోష్ నింపిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌సంగం

ఎన్నిక‌ల శంఖారావం పూరించిన పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్‌

గుంటూరు:  విజ‌య‌వాడ‌-గుంటూరు ప్ర‌ధాన ర‌హ‌దారిపై నాగార్జున యూనివ‌ర్సిటీ ఎదురుగా రెండు రోజులుగా నిర్వ‌హించిన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ 2022 సమావేశాలు ముగిసినట్లు పార్టీ అధికారికంగా ప్రకటించింది. రెండోరోజు వైయ‌స్ఆర్‌సీపీ ప్లీనరీకి పార్టీ శ్రేణులు పోటెత్తాయి. రాష్ట్రం నలుమూలలతో పాటు ఇతర రాష్ట్రాల్లోని అభిమానులు సైతం కోలాహలంగా ప్లీనరీకి హాజరయ్యారు. ఉదయం నుండి కురుస్తున్న‌ వర్షాన్ని లెక్కచేయకుండా ప్లీనరీ ప్రాంగణానికి చేరుకున్నారు. బీహార్, పాట్నా ప్రాంతాల నుండి ప్లీనరీకి వచ్చామని చెబుతున్నారు. అంచ‌నాల‌కు మించి పార్టీ శ్రేణులు ప్లీన‌రీకి హాజ‌రు కావ‌డంతో స‌భా ప్రాంగ‌ణం, మైదానం, విజ‌య‌వాడ‌- గుంటూరు ప్ర‌ధాన ర‌హ‌దారి జ‌న‌సంద్ర‌మైంది. నేల ఈనిందా? ఆకాశానికి చిల్లు ప‌డిందా? స‌ముద్రం ఉప్పొంగిందా అన్న‌ట్లుగా జ‌నం త‌ర‌లివ‌చ్చారు.  

 

ఎన్నికల శంఖారావం

ప్లీనరీ వేదికగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఎన్నికల శంఖారావం పూరించారు. ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లను గెలుచుకోవడం సాధ్యమేని సీఎం వైయస్‌ జగన్‌ ధీమా వ్యక్తం చేశారు.కుప్పం క్లీన్‌ స్వీప్‌ సాధ్యమైంది, టార్గెట్‌ 175  సీట్లు కూడా సాధ్యమేనని ఉద్ఘాటించారు. పార్టీ గెలుపుపై సీఎం వైయస్‌ జగన్‌ పూర్తి భరోసా ఇచ్చారు. పార్టీ ప్రయాణాన్ని వివరిస్తూ ఉద్విగ్నంగా సీఎం వైయస్‌ జగన్‌ ప్రసంగం సాగింది. పార్టీ శ్రేణులకు ఫుల్‌ జోష్‌ ఇచ్చిన వైయస్‌ జగన్‌ ప్రసంగం. కార్యకర్తలకు సెల్యూట్‌ చేస్తూ వారి గొప్ప తనాన్ని సీఎం వైయస్‌ జగన్‌ చాటారు. కార్యకర్తల బాధ్యత సీఎం వైయస్‌ జగన్‌ తన భుజస్కందాల మీద వేసుకున్నారు. పార్టీ విజయాలకు మీరే కారణం, మీకు నేను అండగా ఉంటానన్న సీఎం వైయస్‌ జగన్‌. ఊరూరా వైయస్‌ఆర్‌సీపీ సోషల్‌ మీడియా సైన్యం తయారవ్వాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పిలుపునిచ్చారు. మూడేళ్ల పాలనలో ప్రభుత్వ విజయాలను లెక్కలతో సహా వైయస్‌ జగన్‌ వివరించారు.

నూత‌నోత్సాహం

ప్లీన‌రీ విజ‌య‌వంతం కావ‌డంతో పార్టీ శ్రేణులు నూత‌నోత్సాహం ఇంటి బాట ప‌ట్టారు. రేపొద్దున జగన్‌ మరింతగా ఎదుగుతాడంటే అది కేవలం మీ అండదండలతోనే అని సగర్వగంగా తెలియజేస్తున్నా.. మీ అందరి దీవెనలు.. దేవుడి దయ ప్రజలందరి ఆశీస్సులు.. సదా మనకు. మీ జగనన్నకు ఎప్పుడూ ఉండాలని సవినయపూర్వకంగా కోరుకుంటూ.. ఎంతో దూరం.. ఎంతో అభిమానంతో ప్లీనరీ వచ్చివారందరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరింత ఆత్మవిశ్వాసంతో.. సురక్షితంగా మీ ఇళ్లకు మీరు చేరుకోవాలని.. వెళ్లేటప్పుడు నెమ్మదిగా వెళ్లండని మీ అన్నగా మీకు సలహా ఇస్తూ.. కాస్త ఆలస్యమైన పరవాలేదు నెమ్మది వెళ్లండని సలహా ఇస్తూ.. దేవుడి దయ.. ప్రజల ఆశీస్సులు మన పార్టీపైన ఉండాలని కోరుకుంటూ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ్యాఖ్యానించారు. 

తాజా వీడియోలు

Back to Top