కోవిడ్ నియంత్ర‌ణ‌ చ‌ర్య‌ల‌పై సీఎం స‌మీక్ష‌

తాడేప‌ల్లి: కోవిడ్‌ పరిస్థితులు, థర్డ్‌వేవ్‌, వాక్సినేషన్‌,  హెల్త్‌హబ్స్‌పై ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఆస్ప‌త్రుల్లో కోవిడ్ బాధితుల‌కు అందుతున్న వైద్య సేవ‌లు, వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌, క‌ర్ఫ్యూ అమ‌లు వంటి త‌దిత‌ర అంశాల‌పై ఉన్న‌తాధికారుల‌తో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చ‌ర్చించారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో జరిగిన స‌మావేశానికి డిప్యూటీ సీఎం, వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, కోవిడ్ అండ్ కమాండ్ కంట్రోల్ ఛైర్‌పర్సన్‌ డాక్టర్ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి, అడిషనల్ డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమాల్ సింఘాల్‌, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఎం.టీ.కృష్ణబాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌, 104 కాల్‌ సెంటర్ ఇంఛార్జ్‌ ఎ.బాబు, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్‌ మల్లిఖార్జున్‌, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top