మహానేత వైయ‌స్ఆర్‌కు కుటుంబసభ్యులు ఘన నివాళి

వైయ‌స్ఆర్‌ ఘాట్‌ వద్ద అంజలి ఘటించిన ఏపీ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి  

రాష్ట్రవ్యాప్తంగా వైయ‌స్ఆర్‌ జయంతి వేడుకలు

ఇడుపులపాయ: దివంగత మాజీ ముఖ‍్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖరరెడ్డికి ఆయన కుటుంబసభ్యులు సోమవారం ఘనంగా నివాళులు అర్పించారు. నేడు వైయ‌స్ఆర్‌ 70వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైయ‌స్ఆర్‌  ఘాట్‌ వద్ద ఆయన తనయుడు, ఏపీ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌ సతీమణి, వైయ‌స్ఆర్‌సీపీ గౌర‌వాధ్య‌క్షురాలు వైయ‌స్ విజయమ్మ, వైయ‌స్‌ భారతి రెడ్డి, వైయ‌స్‌ షర్మిల, బ్రదర్‌ అనిల్‌ కుమార్‌, ఎంపీ వైయ‌స్‌ అవినాష్ రెడ్డి, మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే రవీంద్రారెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డితో పాటు  పలువురు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వైయ‌స్ఆర్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు.  వైయ‌స్ఆర్‌ జయంతి సందర్భంగా  రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో రైతు దినోత్సవం నిర్వహించనున్న సంగతి తెలిసిందే.

 

Back to Top