స్కిల్‌ డెవలప్‌మెంట్‌పై సీఎం సమీక్ష

తాడేపల్లి: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాలన్నీ ఒకే గొడుకు కిందకు తీసుకురావాలని సీఎం వైయస్‌ జగన్‌ సూచించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌పై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒక కేంద్రం చొప్పున 25 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. స్కిల్‌డెవలప్‌మెంట్‌ యూనివర్సిటీ ఏర్పాటుపై చర్చించారు. తిరుపతిలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ యూనివర్సిటీ, విశాఖలో హై అండ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాలన్నీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని, ఇవన్నీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ యూనివర్సిటీ కింద నడవాలన్నారు. ఒక్కో పార్లమెంట్‌ పరిధిలో పాలిటెక్నిక్‌ కాలేజీలను గుర్తించి వాటిని నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా మార్చాలని సూచించారు. ఇంజినీరింగ్, డిప్లమా, ఐటీఐ పూర్తిచేసిన వారికి శిక్షణ ఇవ్వాలన్నారు. హై అండ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వర్సిటీ తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. రోబోటిక్స్, ఆర్టిఫిషీయల్, ఇంటెలిజెన్స్‌ స్కిల్స్‌పై శిక్షణ ఇవ్వాలని సూచించారు.

 

Back to Top