సీఎం వైయ‌స్‌ జగన్ కుప్పం పర్యటన 23కు వాయిదా

చిత్తూరు:   ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చిత్తూరు జిల్లా కుప్పం నియోజ‌క‌వ‌ర్గం ప‌ర్య‌ట‌న ఈ నెల 23వ తేదీకి వాయిదా ప‌డింది. వాస్తవానికి ఈ నెల 22న కుప్పంలో ప‌ర్య‌టించాల్సి ఉండ‌గా అనివార్య కారణాల‌తో ఈ నెల 23వ తేదీకి వాయిదా వేశారు.  కుప్పంలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్  వైయ‌స్ఆర్ చేయూత పథకం మూడో విడత నిధులను విడుదల చేస్తారు. 23వ తేదీ ఉదయం 9.15 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరనున్న సీఎం, 10.45 గంటలకు కుప్పం చేరుకుంటారు. 11.15 – 12.45 గంటల మధ్య బహిరంగ సభలో పాల్గొని, వైయస్ఆర్‌ చేయూత పథకం మూడో విడత నిధులను విడుదల చేస్తారు. 1.20 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 3.10 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. 

తాజా వీడియోలు

Back to Top