తాడేపల్లి: రైలు ప్రమాద ఘటనలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారు కోలుకునేంతవరకూ ప్రభుత్వం తోడుగా నిలుస్తుందని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. విజయనగరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సీఎం వైయస్ జగన్ పరామర్శించారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. పరామర్శ అనంతరం సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు. ``విజయనగరం జిల్లా రైలు ప్రమాద ఘటనలో పలువురు మరణించడం బాధాకరం. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఈ ఘటనలో గాయపడి విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించాను. వారు కోలుకునేంతవరకూ ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది. వారికి మంచి వైద్యం అందించడంతో పాటు మరణించిన వారి కుటుంబాలకు, క్షతగాత్రులకు ఎక్స్‌గ్రేషియాను సత్వరమే అందించాలని అధికారులను ఆదేశించాను`` అని సీఎం ట్వీట్ చేశారు. https://x.com/ysjagan/status/1718930342311313720?s=20