వ‌చ్చే ఏడాది వారందరికీ ‘అమ్మఒడి’ ల్యాప్‌టాప్‌లు

ల్యాప్‌టాప్‌లతో పాటు గ్యారెంటీ, వారంటీ కార్డులు ఇవ్వాలి

అధికారులకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆదేశం

తాడేపల్లి: ‘జగనన్న అమ్మఒడి’ పథకం కింద ఆప్షన్‌ ఎంచుకున్న లబ్ధిదారులందరికీ వచ్చే ఏడాది జనవరి 9న ల్యాప్‌టాప్‌లు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అమ్మఒడి పథకంలో ఆప్షన్‌గా ల్యాప్‌టాప్‌ల పంపిణీపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. 2022 జనవరి 9న కోరుకున్న వారందరికీ ల్యాప్‌టాప్‌లు ఇవ్వాలని సూచించారు. ల్యాప్‌టాప్‌లతో పాటు గ్యారెంటీ, వారంటీ కార్డులు కూడా ఇవ్వాలని ఆదేశించారు. అదే విధంగా ప్రతి రెవెన్యూ డివిజన్‌లో తప్పనిసరిగా 51 ల్యాప్‌టాప్‌ సర్వీస్‌ సెంటర్లు ఉండాలన్నారు. ల్యాప్‌టాప్‌ చెడిపోతే సర్వీస్‌ సెంటర్‌కు పంపి వారంలో తిరిగి విద్యార్థులకు ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top