అప్ర‌మ‌త్తంగా ఉండాలి.. ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బంది రాకూడ‌దు

అవ‌స‌ర‌మైన చోట పున‌రావాస శిబిరాలు తెర‌వండి

తుపాన్ ప్ర‌భావంపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్ష‌

తాడేపల్లి: నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు నిరంతరం అప్రమత్తంగా ఉండాల‌ని, ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాల‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశించారు. మాండూస్‌ తుపాను నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితిపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సమీక్షా సమావేశం నిర్వహించారు. తుపాన్ ప్ర‌భావిత ప్రాంతాల్లో పరిస్థితులను అడిగిన తెలుసుకున్న సీఎం.. క‌లెక్ట‌ర్లు, ఉన్న‌తాధికారుల‌కు ప‌లు ఆదేశాలిచ్చారు. తుపాన్‌ ప్రభావిత ప్రాంతాలు, భారీ వర్షసూచన ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు. అవ‌స‌రమైన చోట పునరావాస శిబిరాలను తెరిచి, అన్ని వ‌స‌తులు క‌ల్పించాల‌ని, ప్ర‌జ‌ల‌కు అన్నిరకాలుగా అండగా ఉండాలని ఆదేశించారు. 

Back to Top